నాణ్యమైన బోధనా పద్దతులు పెరగాలి: గవర్నర్

ABN , First Publish Date - 2021-12-23T01:58:02+05:30 IST

ఉన్నత విద్యలో నాణ్యమైన బోధనా పద్దతులు మెరుగుపడాల్సిన అవసరం ఎంతయినా వుందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు.

నాణ్యమైన బోధనా పద్దతులు పెరగాలి: గవర్నర్

హైదరాబాద్: ఉన్నత విద్యలో నాణ్యమైన బోధనా పద్దతులు మెరుగుపడాల్సిన అవసరం ఎంతయినా వుందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. బోధనలను ప్రమాణాలు పెంచి పరిశోధనల్లోనూ ముందుకు వెళ్లడానికి అవకాశం ఉంటుందన్నారు. బుధవారం ఉస్మానియా యూనివర్శిటీలోని టాగోర్ ఆడిటోరియంలో ‘ సినర్జయిజింగ్ హైయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్ ది కాంటెక్స్ట్స ఆఫ్ ఎన్ఈపీ,2020: స్ట్రాటజీస్ ఫర్ ఇంప్లిమెంటేషన్’ అన్న అంశం పై జరిగిన సెమినార్ కు గవర్నర్ ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యూనివర్శిటీల్లో ఖాళీగా వున్న బోధనా పోస్టులను ప్రాధాన్యతా క్రమంలో భర్తీ చేయాలని సూచించారు. తద్వారా విద్యలో నాణ్యత, విద్యా ప్రమాణాలు మెరుగు పడాతాయన్నారు. 


జాతీయ ఎడ్యుకేషన్ పాలసీ;2020 వల్ల విద్యావ్యవస్థలో మంచి మార్పులు తీసుకు రావడానికి అవకాశం ఉంటుందని గవర్నర్ పేర్కొన్నారు. తద్వారా భారత దేశం విశ్వగురుగా ఎదిగేందుకు దోహద పడుతుందన్నారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ(ఎన్ఈపీ:2020) అమలు చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రప్రభుత్వంతోభాగస్వామ్యంతో పని చేయాలన్నారు. తద్వారా ఉన్నత విద్యలో మరిన్ని నాణ్యమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం వుందన్నారు. ఈ కార్యక్రమలో ఏఐసిటిఈ ఛైర్మన్ ప్రొఫెసర్ అనిల్ సహర్షబుద్దే, తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆర్. లింబాద్రి, కర్నాటక సెంట్రల్ యూనివర్శిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ భట్టు సత్యనారాయణ, ఉస్మానియా యూనివర్శిటీ వీసీ ప్రొఫెసర్ డి. రవీందర్ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-23T01:58:02+05:30 IST