ప్రభుత్వ భవన సముదాయం ప్రారంభం

ABN , First Publish Date - 2022-10-02T04:08:07+05:30 IST

మండలంలోని చామదలలో ఉపాధి హామీ నిధులతో నిర్మించిన గ్రామసచివాలయం, రైతుభరోసా కేంద్రం, విలేజ్‌ హెల్త్‌క్లినిక్‌ల భవనాల సముదాయాన్ని ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, సర్పంచు పీ.సీతారావమ్మతో కలసి కలెక్టర్‌ చక్రధర్‌బాబు శనివారం ప్రారంభించారు.

ప్రభుత్వ భవన సముదాయం ప్రారంభం
చామదలలో శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌, ఎమ్మెల్యే

జలదంకి, అక్టోబర్‌ 1: మండలంలోని చామదలలో ఉపాధి హామీ నిధులతో నిర్మించిన గ్రామసచివాలయం, రైతుభరోసా కేంద్రం, విలేజ్‌ హెల్త్‌క్లినిక్‌ల భవనాల సముదాయాన్ని ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, సర్పంచు పీ.సీతారావమ్మతో కలసి కలెక్టర్‌ చక్రధర్‌బాబు శనివారం ప్రారంభించారు. అనంతరం రూ.1.41 కోట్లతో నిర్మించనున్న పాఠశాల అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ శాఖల అధికారులతో మండల అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై కలెక్టర్‌, ఎమ్మెల్యేలు సమీక్షించారు. అనంతరం గ్రామప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ కార్యక్రమాల్లో వైసీపీ మండల కన్వీనర్‌ చేవూరి జనార్దన్‌రెడ్డి, జడ్పీటీసీ సభ్యురాలు మేదరమెట్ల శివలీల, జలదంకి సొసైటీ అధ్యక్షుడు కేతిరెడ్డి రవిరెడ్డి, మండల పరిషత్‌ ఉపాధ్యక్షుడు పాలవల్లి మాలకొండారెడ్డి, చామదల-1, 2 ఎంపీటీసీ సభ్యులు పీ.అమరావతి, డీ.విజయ్‌రెడ్డి, సర్పంచులు రావి ప్రసాద్‌నాయుడు, తమ్మినేని సతీ్‌షనాయుడు, వైసీపీ నాయకులు వంటేరు లక్ష్మీనరసారెడ్డి, గుర్రం జగ్గయ్యనాయుడు, వట్టికాల బాలయ్య, ఎస్‌వీ శేషారెడ్డి, మండల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌ పనుల పరిశీలన

మండలంలోని జమ్మలపాలెంలో ఏర్పాటవుతున్న జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌ పనులను కలెక్టర్‌ చక్రధర్‌బాబు పరిశీలించారు. నుడా అధికారులు పనుల వివరాలను కలెక్టర్‌కు వివరించారు. ఈయన వెంట నుడా వైస్‌చైర్మన్‌ ఓబులే్‌షనందన్‌, జలదంకి తహసీల్దారు సీతామహాలక్ష్మి ఉన్నారు.

Updated Date - 2022-10-02T04:08:07+05:30 IST