Govt bus auto driver: ప్రభుత్వ బస్సు నడిపిన ఆటో డ్రైవర్‌

ABN , First Publish Date - 2022-07-27T15:46:42+05:30 IST

ప్రభుత్వ బస్సు(Govt bus)ను ఆటో డ్రైవర్‌ నడిపిన వ్యవహారంలో డ్రైవర్‌, కండక్టర్లపై సస్పెన్షన్‌ వేటుపడింది. తేని-కుచ్చనూర్‌ మధ్య నడిచే ప్రభుత్వ బస్సు డ్రైవర్‌గా పాండి

Govt bus auto driver: ప్రభుత్వ బస్సు నడిపిన ఆటో డ్రైవర్‌

                                       - కండక్టర్‌, డ్రైవర్‌ సస్పెన్షన్‌


పెరంబూర్‌(చెన్నై), జూలై 26: ప్రభుత్వ బస్సు(Govt bus)ను ఆటో డ్రైవర్‌ నడిపిన వ్యవహారంలో డ్రైవర్‌, కండక్టర్లపై సస్పెన్షన్‌ వేటుపడింది. తేని-కుచ్చనూర్‌ మధ్య నడిచే ప్రభుత్వ బస్సు డ్రైవర్‌గా పాండి విశ్వనాధన్‌ (38), కండక్టర్‌గా వినోద్‌కుమార్‌ (29) విధులు చేపట్టారు. కొద్దిరోజులు క్రితం డ్రైవర్‌ విశ్వనాధన్‌ స్నేహితుడు ఆటో డ్రైవర్‌ శరవణన్‌ బస్సు ఎక్కాడు. ఆ సమయంలో బస్సు నడపాలని ఆశగా ఉందని స్నేహితుడు(a friend) శరవణన్‌ కోరడంతో విశ్వనాధన్‌ అవకాశమిచ్చారు. సుమారు 7 కి.మీ మేర శరవణన్‌ బస్సు నడపగా ఆ దృశ్యాలను విశ్వనాధన్‌ సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడు. అదే సమయంలో ఓ ప్రయాణికుడు కూడా వీడియో తీసి సోషల్‌ మీడియా(Social media)లో పోస్ట్‌ చేయడంతో కలకలం రేగింది. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టిన తేని రీజియన్‌ జనరల్‌ మేనేజర్‌ సత్యమూర్తి, విధుల్లో నిర్లక్ష్యం వహించిన డ్రైవర్‌ విశ్వనాధన్‌, కండక్టర్‌ వినోద్‌కుమార్‌లను సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు.

Updated Date - 2022-07-27T15:46:42+05:30 IST