ప్రభుత్వ కార్యాలయంలోకి దర్జాగా వెళ్లిన మేక.. అక్కడ అది చేసిన పనికి తలలు పట్టుకున్న అధికారులు.. ఆ తర్వాత దాని వెనకాలే..
ABN , First Publish Date - 2021-12-03T22:58:37+05:30 IST
ప్రభుత్వ కార్యాలయంలోకి దర్జాగా వెళ్లిన ఓ మేక.. అక్కడి అధికారులు తలలుపట్టుకునేలా చేసింది. అంతేకాకుండా అక్కడి సిబ్బందిని పరుగులు పెట్టించింది. ప్రస్తుతం ఆ మేకకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీం
ఇంటర్నెట్ డెస్క్: ప్రభుత్వ కార్యాలయంలోకి దర్జాగా వెళ్లిన ఓ మేక.. అక్కడి అధికారులు తలలుపట్టుకునేలా చేసింది. అంతేకాకుండా అక్కడి సిబ్బందిని పరుగులు పెట్టించింది. ప్రస్తుతం ఆ మేకకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో నెటిజన్లు స్పందిస్తూ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ అధికారులు తలలుపట్టుకునేంత పని ఆ మేక ఏం చేసిందనే వివరాల్లోకి వెళితే..
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఉన్న ఓ ప్రభుత్వ కార్యాలయంలోకి ఓ మేక బుధవారం రోజు దర్జగా ప్రవేశించింది. అనంతరం కొద్ది సమయం వరకూ ఆఫీస్‌లోనే అటూ ఇటూ తిరిగింది. ఆ తర్వాతే.. అక్కడి అధికారులకు షాకిచ్చింది. కార్యాలయంలో ఉన్న ఓ ముఖ్యమైన ఫైలును నోట కరుచుకుని బయటికొచ్చింది. అది గమనించిన అధికారులు.. తలలు పట్టుకున్నారు. ఈ క్రమంలోనే కార్యాలయంలో పని చేసే సిబ్బంది.. ఫైలు కోసం మేక వెంట పరుగులు తీశారు. ఈ దృశ్యాలను కొందరు స్థానికులు వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం అదికాస్తా వైరల్‌గా మారింది. దీంతో స్పందిస్తున్న నెటిజన్లు.. ‘ఆఫీస్‌లోకి మేక వచ్చి.. ఫైల్‌ను తీసుకెళ్లేదాకా మీరేం చేస్తున్నారు’ అంటూ కామెంట్ల రూపంలో అధికారులపై ప్రశ్నలు కురిపిస్తున్నారు.