కరోనా ‘అల’జడులకు నాలుగు ప్రధాన కారణాలు: కేంద్రం వివరణ

ABN , First Publish Date - 2021-06-23T04:04:40+05:30 IST

కరోనా మెదటి వేవ్.. రెండో వేవ్, మూడో వేవ్ అంటూ విడతల వారీగా కరోనా దాడి చేయడం వెనుకు ప్రధానంగా నాలుగు కారణాలు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా వివరించింది.

కరోనా ‘అల’జడులకు నాలుగు ప్రధాన కారణాలు: కేంద్రం వివరణ

న్యూఢిల్లీ: కరోనా మెదటి వేవ్..  రెండో వేవ్, మూడో వేవ్ అంటూ విడతల వారీగా కరోనా దాడి చేయడం వెనుకు ప్రధానంగా నాలుగు కారణాలు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా వివరించింది. దీని ప్రకారం.. వైరస్ వేగంగా వ్యాప్తి చెందగలిగిన సామర్థ్యం వీటిల్లో మొదటిది. వ్యాక్సినేషన్ లేని కారణంగా ప్రజలు సులువుగా దీని బారినపడటం, మ్యూటేషన్లతో వైరస్‌ మార్పు చెందడం, కరోనా వ్యాప్తికి కావాల్సిన అవకాశం సమాజంలో ఉండటమనేవి ఇతర ముఖ్యకారణాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. కరోనా సెకెండ్ వేవ్ తగ్గుముఖం పడుతున్న ప్రస్తుత తరుణంలో మూడో వేవ్ భయాలు వేళ్లూనుకుంటున్న విషయం తెలిసిందే. కొత్తగా ఉనికిలోకి వచ్చిన డెల్టా ప్లస్ వేరియంట్‌ ప్రస్తుతం ప్రజల్లో భయాందోళనలకు కారణమవుతోంది. 

Updated Date - 2021-06-23T04:04:40+05:30 IST