ఆక్రమణలపై నజర్.. నిజామాబాద్‌లో ప్రత్యేక ఏజెన్సీ ద్వారా వివరాల సేకరణ

ABN , First Publish Date - 2020-10-15T16:22:25+05:30 IST

నిజామాబాద్‌ నగర శివారులో జరుగుతున్న అక్రమ కార్యకలాపాలపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అధికార అండదండలు ఉన్నాయని చెప్పి శివారులో చేస్తోన్న భూ ఆక్రమణలు, మట్టి, మొరం కోసం గుట్టల తవ్వకాలపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది. పేదల భూముల్లో పాగా వంటి అంశాల పై ఫిర్యాదులు అందడంతో ప్రత్యేక ఏజెన్సీల ద్వారా నివేది కలు తీసుకుంటూ సమాచారం సేకరిస్తున్నారు.

ఆక్రమణలపై నజర్.. నిజామాబాద్‌లో ప్రత్యేక ఏజెన్సీ ద్వారా వివరాల సేకరణ

శివారులో కబ్జా, ఇతర భూదందా సూత్రధారులపై నివేదిక


నిజామాబాద్ (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): నిజామాబాద్‌ నగర శివారులో జరుగుతున్న అక్రమ కార్యకలాపాలపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అధికార అండదండలు ఉన్నాయని చెప్పి శివారులో చేస్తోన్న భూ ఆక్రమణలు, మట్టి, మొరం కోసం గుట్టల తవ్వకాలపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది. పేదల భూముల్లో పాగా వంటి అంశాల పై ఫిర్యాదులు అందడంతో ప్రత్యేక ఏజెన్సీల ద్వారా నివేది కలు తీసుకుంటూ సమాచారం సేకరిస్తున్నారు. నగరం పరిధిలోని కొంత మంది అధికారం అడ్డం పెట్టుకుని చేస్తోన్న ఈ దందాలపై గత ంలో వామపక్షాలతో పాటు బీజేపీ నేతలు కలెక్టరేట్‌ వద్ద ధర్నాలు చేయడం, న్యాయం చేయాలని కోరడంతో పాటు ఫ్యాక్స్‌ల ద్వారా ప్రభుత్వానికి పంపించడంతో యంత్రాంగం కదిలినట్లు తెలుస్తోం ది. వీరే కాక మరి కొంత మంది నేరుగా ప్రభుత్వానికి పంపిన ట్లు తెలుస్తోంది. నిజామాబాద్‌ నగర శివారులోని నాగారం, సారంగాపూర్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో కొన్నేళ్లుగా ప్రభు త్వ, ప్రైవేటు భూములు ఆక్రమణకు గురవుతున్నాయి. పేద లకు ఇచ్చిన భూములు కూడా కబ్జాకు గురయ్యాయి. వీటి తో పాటు కొన్ని భూములను కబ్జా చేయడంతో పాటు ఇతరులకు అమ్మకాలను చేశారు. 


చాలా భూముల్లో కొంత మంది నేతల ప్రమేయం ఉండడంతో పేదలు ఫిర్యాదు చేసేందుకు జంకారు. తప్పనిసరి పరిస్థితు లలో వామపక్షాలు, బీజేపీ నేతలతో కలిసి గత నెల లో ధర్నాలు చేశారు. తమకు న్యాయం చేయాలని కోరారు. జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. కొంత మంది పేదలు ఈ విషయాన్ని ప్రభుత్వా నికి చేరవేశారు. తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ విషయాలతో పాటు నగర శివారులోని గుట్టలలో అనుమతి లేకుండా తవ్వ కాలు చేయడం, మొరం, మట్టిని ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా తరలించడం వంటి పనులపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఈ దందాపై ఎవరైనా నిలదీస్తే బెదిరించడంతో పేదలు కూడా వెనుకడుగు వేశారు. నగరంలో నూతనంగా నిర్మించే భవనాలతో పాటు ఇతర కట్టడాలకు వీరి సహకా రంతోనే మొరం, మట్టి సరఫరా అవుతోంది. నగర శివారులో కొన్నేళ్లుగా సాగడం అడ్డూ అదుపూ లేకపోవడం, మండల స్థాయి అధికారులు పట్టించుకోకపోవడం వల్ల ఇది కొనసాగుతోంది. చివరకు ఈ అక్రమాల పై ప్రభుత్వానికి ఫిర్యాదు అందడంతో వివరాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. 


దృష్టి సారించిన ప్రత్యేక ఏజెన్సీ..

నగర శివారులలో జరుగుతున్న ఈ వ్యవహారంలో ఎవరెవరికి సంబ ంధం ఉంది. వారు ఏమేం చేస్తున్నారు. భూముల అక్రమాల్లో వారి భాగస్వామ్యం ఎంత ఉంది. ఎవరు వారికి సహకరిస్తున్నారు. ఈ అక్ర మాల్లో పాలు పంచుకుంటున్నవారు పదవుల్లో ఉన్నారా వంటి అంశాల పై ప్రత్యేక ఏజెన్సీ వారు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. వీరికి అధికార పక్షంతో సంబంధం ఉందా, ఇతర పార్టీల నేతలు ఈ దందాలో ఉన్నారా వంటి విషయాలను ఆరా తీసినట్లు తెలిసింది. ఇవే కాకుండా భూముల వ్యవహారంలో దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ అంశాల అన్నింటి ఆధారంగా నివేదిక పంపుతున్నట్లు సమాచారం. ఈ దందాలలో భాగ స్వామ్యం ఉన్న కొంత మందిని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కూడా హెచ్చరించినట్లు తెలుస్తోంది. కొన్ని రోజులుగా పార్టీకి దూరంగా ఉంచు తున్నట్లు సమాచారం. ప్రభుత్వానికి నివేదిక వెళ్లిన తర్వాత చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Updated Date - 2020-10-15T16:22:25+05:30 IST