కొవిడ్‌ వ్యాక్సినేషన్‌లో ప్రభుత్వం విఫలం

ABN , First Publish Date - 2021-05-09T06:17:32+05:30 IST

రాష్ట్రంలోని ప్రజల ను వైరస్‌ బారి నుంచి కాపాడేందుకు ముందస్తుగా కొ విడ్‌ వ్యాక్సినేషన్‌ చేయడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైందని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపిం చారు. 18 నిండిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్‌ వేయాలని డిమాండ్‌ చేస్తూ టీడీపీ ఆధ్వర్యంలో శనివారం నిర సన కార్యక్రమాలు చేపట్టారు.

కొవిడ్‌ వ్యాక్సినేషన్‌లో ప్రభుత్వం విఫలం
పర్చూరులో నిరసనలు వ్యక్తం చేస్తున్న కార్యర్తలు

టీడీపీ శ్రేణుల విమర్శలు

అధిష్ఠానం పిలుపుతో నిరసనలు


ఒంగోలు (కార్పొరేషన్‌), మే 8 : రాష్ట్రంలోని ప్రజల ను వైరస్‌ బారి నుంచి కాపాడేందుకు ముందస్తుగా కొ విడ్‌ వ్యాక్సినేషన్‌ చేయడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైందని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపిం చారు. 18 నిండిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్‌ వేయాలని డిమాండ్‌ చేస్తూ టీడీపీ ఆధ్వర్యంలో శనివారం నిర సన కార్యక్రమాలు చేపట్టారు.  ఈ సందర్భంగా ఒంగో లులోని జిల్లా పార్టీ కార్యాలయంలో చేపట్టిన నిరసన దీక్షలో దర్శి కో-ఆర్డినేటర్‌ పమిడి రమేష్‌, నగర అధ్యక్షు లు కొఠారి నాగేశ్వర రావు, ఏఎంసీ మాజీ చైర్మన్‌ కామేపల్లి శ్రీ నివాసరావు మా ట్లాడుతూ వేగంగా వి స్త రిస్తున్న కరోనాను నివారించడంలో, ప్రజలకు వ్యాక్సిన్‌ అందించడంలో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిం దన్నారు. జిల్లాలో 18 సంవత్సరాల వయస్సు దాటిని ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్‌ వేయాలన్నారు. గత ఏడాదిలో నే సెకండ్‌ వేవ్‌ వస్తుందని శాస్త్రజ్ఞులు, ప్రపంచ దే శాలు హెచ్చరించాయని, కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు పెడచెవిన పెట్టి ఇష్టారాజ్యాంగా వ్యవహరించడం వల్లే ఈ రోజు దుస్థితి ఎదురైందన్నారు. జిల్లాలో రోజు రోజుకు బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారని, అయితే మరణాల సంఖ్య తగ్గించడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమని విమర్శించారు. ఎక్కడ కూడా కొవిడ్‌ రోగులకు మెరుగైన వైద్యం ల భించడం లేదని, తగినన్ని బెడ్‌లు, ఆక్సిజన్‌, వెంటిలే టర్స్‌, వైద్యులు, ఆరోగ్య సిబ్బంది లేకపోవడం ప్రభు త్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆరోపించారు. ఇప్ప టికైనా ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్ర భుత్వం తగిన చర్యలు తీసుకోవడంతోపాటు మెరు గైన వైద్యం అందించాలని డిమాండ్‌ చేశారు. కార్య క్రమంలో నగర కార్యరద్శి దాయనేని ధర్మ, కార్పొరే టర్లు సండ్రపాటి వర్డ్స్‌వర్త్‌, అంబూరి శ్రీనివాసరావు, నాయకులు ఎద్దు శశికాంత్‌ భూషణ్‌, ఎం.శేషం రాజు, ఉండవల్లి రాము, సాగర్‌ తదితరులు పాల్గొన్నారు. 

 నాగులుప్పలపాడు(ఒంగోలురూరల్‌): ‘‘సీఎం గారు కళ్లుతెరండి. కరోనాతో  ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నా రు. కరోనా రోగులకు మంచి వైద్యం అందించండీ’’ అం టూ నాగులుప్పలపాడు మండల టీడీపీ ఎస్సీ సెల్‌ అఽ ద్యక్షుడు తెలగతోటి తెలగతోటి జాన్సన్‌ డిమాండ్‌ చేశారు. మండలంలోని ఉప్పగుండూరు గ్రామంలోని తన గృహంలో  టీడీపీ అధిష్ఠానం పిలుపు మేరకు శ నివారం కరోనా రోగులకు మంచి వైద్యం అందించాలని ప్లకార్డుతో నిరసన కార్యక్రమం చేపట్టారు.  ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ పాలన చేతకాకుంటే మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి ము ఖ్యమంత్రి పదవి ఇచ్చి పక్కకు తప్పకోవాలని డి మా ండ్‌ చేశారు. ప్రజలను ఆదుకోవాలన్నారు.

సంతనూతలపాడు:  ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి 18 నుంచి 45 సంవత్సరాల వయస్సు వారికి మే 1 నుంచి వ్యాక్సిన్‌ వేస్తామని చెప్పి ఇప్పట్లో వేయలే మని చెప్పడం ప్రభుత్వం చేతగానితనమని టీడీపీ మండలాధ్యక్షుడు మద్దినేని హరిబాబు విమర్శించారు. శనివారం సంతనూతలపాడు టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరోనా బాధితులకు ఆక్సిజన్‌ అందించలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. టీడీపీ నాయకులపై అక్రమ కే సులు బనాయించడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయ డమనని ఆరోపించారు. కార్యక్రమంలో నాయకులు టి.నరసింహారావు, చెరుకూరి శ్రీను, తన్నీరు శ్రీను, శ్రీ రామూర్తి, అంకారావు, కొండలరావు, సురేష్‌, సుబ్బారా వు తదితరులు పాల్గొన్నారు.

పర్చూరు : నియోజకవర్గ వ్యాప్తంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున శనివారం నిరస న వ్యక్తం చేశారు. కరోనా వ్యాక్సిన్‌ ఇవ్వాలి, ప్రజల ప్రా ణాలను కాపాడాలన్న నినాదంతో తమ గృహాలు కా ర్యాలయాల్లో  కరోనా నిబంధనలను పాటిస్తూ నిరసన లు వ్యక్తం చేశారు. ఇంకొల్లు, పర్చూరు, యద్దనపూడి, మార్టూరు, చినగంజాం, కారంచేడు మండలాల్లో నా యకులు కార్యకర్తలు నిరసనలు చేపట్టారు.


Updated Date - 2021-05-09T06:17:32+05:30 IST