దేశీయ విమానయాన సంస్థలకు గుడ్‌న్యూస్

ABN , First Publish Date - 2021-10-13T01:15:57+05:30 IST

దేశీయ విమాన ప్రయాణికులకు, విమానయాన సంస్థలకు ఇది శుభవార్తే. కరోనా నేపథ్యంలో దేశీయ విమాన

దేశీయ విమానయాన సంస్థలకు గుడ్‌న్యూస్

న్యూఢిల్లీ: దేశీయ విమాన ప్రయాణికులకు, విమానయాన సంస్థలకు ఇది శుభవార్తే. కరోనా నేపథ్యంలో దేశీయ విమాన ప్రయాణికుల సామర్థ్యంపై ఆంక్షలు విధించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా వాటిని ఎత్తివేసింది. ఈ నెల 18 నుంచి ఇది అమల్లోకి వస్తుందని, పూర్తిస్థాయి సామర్థ్యంతో విమానాలను నడిపించుకోవచ్చని పౌర విమానయాన మంత్రిత్వశాఖ తెలిపింది. ప్రస్తుతం దేశీయ విమానాలు 85 శాతం సామర్థ్యంతో సేవలు అందిస్తున్నాయి. 


ప్రయాణికుల డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత పరిస్థితిని సమీక్షించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్టు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది. అక్టోబరు 18 నుంచి సామర్థ్యంపై ఎలాంటి పరిమితులు లేకుండా దేశీయ విమానయాన సంస్థలు సేవలు అందించవచ్చని పేర్కొంది. అయితే, మిగతా ఆంక్షలన్నీ అలానే ఉంటాయని, కొవిడ్ మార్గదర్శకాలను తప్పకుండా పాటించాల్సిందేనని స్పష్టం చేసింది.

Updated Date - 2021-10-13T01:15:57+05:30 IST