వాహన బీమా విభాగంలో ప్రభుత్వ ఇన్సూరెన్స్‌ కంపెనీలు డీలా

ABN , First Publish Date - 2021-10-17T06:27:38+05:30 IST

మోటార్‌ ఇన్సూరెన్స్‌ మార్కెట్‌పై ప్రభుత్వ రంగ సాధారణ బీమా సంస్థలు క్రమంగా పట్టు కోల్పోతున్నాయి. 2017-18 ఆర్థిక సంవత్సరం నుంచి ఇప్పటివరకు 30 శాతం మేర వ్యాపారాన్ని కోల్పోయాయని...

వాహన బీమా విభాగంలో ప్రభుత్వ ఇన్సూరెన్స్‌ కంపెనీలు డీలా

  • 2017-18 ఆర్థిక సంవత్సరం నుంచి 30శాతం వ్యాపారం కోల్పోయిన సంస్థలు

ముంబై: మోటార్‌ ఇన్సూరెన్స్‌ మార్కెట్‌పై ప్రభుత్వ రంగ సాధారణ బీమా సంస్థలు క్రమంగా పట్టు కోల్పోతున్నాయి. 2017-18 ఆర్థిక సంవత్సరం నుంచి ఇప్పటివరకు 30 శాతం మేర వ్యాపారాన్ని కోల్పోయాయని కేర్‌ రేటింగ్స్‌ తాజా నివేదిక వెల్లడించింది. 2020 ఆగస్టు నాటికి మోటార్‌ ఇన్సూరెన్స్‌ సెగ్మెంట్‌లో 36.6 శాతంగా ఉన్న ప్రభుత్వ బీమా కంపెనీల వాటా ఈ ఏడాదిలో అదే నెల ముగిసేసరికి 32.6 శాతానికి పడి పోయిం ది. అదే సమయంలో ప్రైవేట్‌ రంగ సాధారణ బీమా కంపెనీల మొత్తం వాటా 63.4 శాతం నుంచి 67.4 శాతానికి పెరిగింది. ప్రభుత్వ బీమా కంపె నీలకు ప్రధాన ఆదాయ వనరు ఈ విభాగమే. 



Updated Date - 2021-10-17T06:27:38+05:30 IST