తెలంగాణలో రాత్రి కర్ఫ్యూ మళ్లీ పొడిగింపు

ABN , First Publish Date - 2021-05-08T00:08:59+05:30 IST

తెలంగాణలో కొనసాగుతున్న రాత్రి కూర్ఫూ శనివారంతో పూర్తి కానుండడంతో ప్రభుత్వం మళ్లీ వారం రోజుల పాటు పొడిగించింది. కర్పూ ఈనెల 15వ తేదీ ఉదయం 5గంటల వరకు కొనసాగుతుందని

తెలంగాణలో రాత్రి కర్ఫ్యూ మళ్లీ పొడిగింపు

హైదరాబాద్‌: తెలంగాణలో కొనసాగుతున్న రాత్రి కూర్ఫూ శనివారంతో పూర్తి కానుండడంతో ప్రభుత్వం మళ్లీ వారం రోజుల పాటు పొడిగించింది. కర్పూ ఈనెల 15వ తేదీ ఉదయం 5గంటల వరకు కొనసాగుతుందని శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కర్ప్యూ సందర్భంగా రాత్రి 8గంటకు వ్యాపార సముదాయాలు, హోటళ్లు, ఇతర సంస్థలు మూసివేయాలన్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, కమిషనర్స్‌, సూపరింటెండ్‌ ఆఫ్‌పోలీసులకు అధికారాలను కట్టబెట్టారు. ఇక రాష్ట్రంలో కోవిడ్‌ కేసులు విస్తరిస్తున్న నేపద్యంలో మరికొన్ని ఆంక్షలను ప్రభుత్వం ప్రకటించింది.


ఇందులో వివాహాలు, ఇతర ఫంక్షన్‌ల నిర్వహణపై ఆంక్షలు విధించారు. ఈ వేడుకల్లో 100కి మాత్రమే, అదీ కొవిడ్‌ నిబంధనలు పాటించేలా అనుమతిస్తారు. అలాగే శవాల ఊరేగింపులు, దహన సంస్కారాలకు కేవలం 20 మందికి మాత్రమే అనుమతిస్తారు. కాగా  రాజకీయ పార్టీల సమావేశాలు, స్పోర్ట్స్‌, ఎంటర్‌ టెయిన్‌మెంట్‌, వంటి కార్యక్రమాలను కూడా ప్రభుత్వం పూర్తిగా నిషేధించింది. 

Updated Date - 2021-05-08T00:08:59+05:30 IST