శిథిలస్థితిలో ప్రభుత్వ కార్యాలయాలు

ABN , First Publish Date - 2021-11-12T04:05:26+05:30 IST

ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో పలు ప్రభుత్వ భవనాలు శిథిలస్థితికి చేరాయి. ఇటీవల కురిసిన వర్షాలకు ఉరుస్తుడడంతో అవస్థలు పడుతున్నారు.

శిథిలస్థితిలో ప్రభుత్వ కార్యాలయాలు

ఆత్మకూరు, నవంబరు 11: ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో పలు ప్రభుత్వ భవనాలు శిథిలస్థితికి చేరాయి. ఇటీవల కురిసిన వర్షాలకు ఉరుస్తుడడంతో అవస్థలు పడుతున్నారు. రికార్డులు భద్రపరుచుకోడానికి అధికారలు ఇబ్బందులు పడుతున్నారు. నూతన ప్రభుత్వ కార్యాలయ భవనాల నిర్మాణానికి కోట్లాది రూపాయలతో చేపట్టిన పనులు నత్తనడక సాగు తున్నాయి. దాంతో కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు చాలీచాలని భవనాల్లో కొనసాగుతున్నాయి.  ఇందుకు తహసీల్దారు, సబ్‌ట్రెజరీ, సబ్‌రిజిస్ర్టార్‌, ఆర్డీవో కార్యాలయాలే ప్రత్యక్ష నిదర్శనం.

 ఆత్మకూరు తహసీల్దారు కార్యాలయం ఇటీవల కురిసిన వర్షాలకు పూర్తిగా ఉరుస్తుండ డంతో సిబ్బంది ఇబ్బందికరంగా విధులు నిర్వహిస్తున్నారు. ఎట్టకేలకు కార్యాలయం పైభాగాన్ని ప్లాస్టిక్‌ కవర్లు కప్పి కాలం వెళ్లదీయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక సబ్‌ ట్రెజరీ, సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయాలు సైతం బ్రిటీష్‌ కాలంనాటివి కావడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ఆర్డీవో కార్యాలయం చాలీచాలని భవనంలో నడుస్తోంది. 2013లో కార్యాలయాల నూతన భవనాల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. భవన నిర్మాణాలు నత్తనడకన సాగుతుండడంతో శిథిల భవనాల్లోనే కొనసాగుతున్నాయి. ఆర్డీవో కార్యాలయ సముదాయం నిర్మాణానికి  రూ.3 కోట్లు మంజూరయ్యాయి.  ప్రస్తుతం భవనం నిర్మాణాలు శ్లాబు దశకు చేరుకున్నాయి. నెల్లూరు పాళెం సమీపంలో ఆర్‌అండ్‌బీ అతిఽథిగృహం ఉంది. అది పూర్తిగా మరమ్మతులకు గురికావ డంతో ఆత్మకూరు చెరువుకట్ట సమీపంలో నూతన భవన నిర్మాణానికి రూ.50 లక్షలతో 2013లో శంకుస్థాపన చేశారు. నిర్మాణ పనులు పూర్తి కాకపోవడంతో నిరుపయోగంగానే దర్శనమి స్తోంది. శిథిల భవనంలోనే ఆర్‌అండ్‌బీ కార్యాలయం, అతిఽఽథి గృహం కొనసాగుతుండడం గమనార్హం.

Updated Date - 2021-11-12T04:05:26+05:30 IST