భారతీయులను తరలించేందుకు విమానాలను సిద్ధం చేస్తున్న ప్రభుత్వం!

ABN , First Publish Date - 2022-02-17T00:01:18+05:30 IST

ఉక్రెయిన్‌లోని భారతీయులను స్వదేశానికి తరలించేందుకు భారత ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం విమానాలను సిద్ధం చేస్తున్నట్టు ఉక్రెయిన్‌లోని ఇండియన్ ఎంబసీ తాజాగా చేసిన ప్రకటనలో తెలిపిం

భారతీయులను తరలించేందుకు విమానాలను సిద్ధం చేస్తున్న ప్రభుత్వం!

ఎన్నారై డెస్క్: ఉక్రెయిన్‌లోని భారతీయులను స్వదేశానికి తరలించేందుకు భారత ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం విమానాలను సిద్ధం చేస్తున్నట్టు ఉక్రెయిన్‌లోని ఇండియన్ ఎంబసీ తాజాగా చేసిన ప్రకటనలో తెలిపింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..



ఉక్రెయిన్-రష్యా మధ్య గత కొన్ని రోజులుగా ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. రష్యా బలగాలు ఏ క్షణమైనా ఉక్రెయిన్‌పై దాడి చేయవచ్చనే ఉద్దేశంతో ఇప్పటికే చాలా దేశాలు తమ పౌరులను ఉక్రెయిన్‌ నుంచి తిరిగి వచ్చేయాలని సూచించాయి. ఈ క్రమంలోనే భారత ప్రభుత్వం కూడా కీలక ప్రకటన చేసింది. అత్యవసరం అయితే తప్ప అక్కడ ఉండొద్దని.. తాత్కాలికంగా ఉక్రెయిన్‌ను వీడాలని సూచించింది. ఈ క్రమంలో ఉక్రెయిన్‌లో విద్యాభ్యాసం చేస్తున్న కొందరు భారతీయ విద్యార్థులు, పౌరులు స్వదేశానికి తిరిగి రావడానికి రెడీ అయ్యారు. అయితే అందుబాటులో తగినన్ని విమాన సర్వీసులు లేవని తెలిసి.. ఎంబసీని సంప్రదించారు. ఈ నేపథ్యంలోనే ఇండియన్ ఎంబసీ తాజాగా కీలక ప్రకటన చేసింది. విద్యార్థులను ఉద్దేశిస్తూ భయాందోళనలకు గురవ్వొద్దని సూచించింది. అయితే.. సాధ్యమైనంత వరకు తొలుత అందుబాటులో ఉన్న విమానాల్లో వెళ్లేందుకు ప్రయత్నించాలని తెలిపింది. ఉక్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్, ఎయిర్ అరేబియా, ఫ్లై దుబాయ్, ఖతార్ ఎయిర్వేస్‌ తదితర ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానాలు ప్రస్తుతం ఇండియా-ఉక్రెయిన్ మధ్య సర్వీసులు అందిస్తున్నట్టు వెల్లడించింది. వీటితోపాటు అవసరమైతే మరిన్ని అదనపు విమానాలను కూడా నడిపేందుకు ప్లాన్ చేస్తున్నట్టు చెప్పింది. ఇందుకోసం చర్చలు జరుపుతున్నట్టు వెల్లడించింది.




Updated Date - 2022-02-17T00:01:18+05:30 IST