గ్రానైట్‌ పరిశ్రమను ఆదుకోవాలి

ABN , First Publish Date - 2021-06-23T06:50:50+05:30 IST

‘అధికార పార్టీ నా యకుల ఆగడాల కారణంగా జిల్లాలోని గ్రానై ట్‌ పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోయింది.. గ్రానైట్‌ అక్రమ రవాణాకు వైసీపీ నాయకులు అండదండలు అందిస్తున్నారు. జిల్లాతో సంబం ధం లేని ప్రత్యేక అఽఽధికారితో ఈ అక్రమ దం దాపై విచారణ చేయించాలి’’ అని బాపట్ల పార్టమెంటరీ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు డిమాండు చేశారు.

గ్రానైట్‌ పరిశ్రమను ఆదుకోవాలి
ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు

అక్రమ దందా చేసే వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలి

టీడీపీ బాపట్ల పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు ‘ఏలూరి’ డిమాండ్‌ 


మార్టూరు, జూన్‌ 22 : ‘‘అధికార పార్టీ నా యకుల ఆగడాల కారణంగా జిల్లాలోని గ్రానై ట్‌ పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోయింది.. గ్రానైట్‌ అక్రమ రవాణాకు వైసీపీ నాయకులు అండదండలు అందిస్తున్నారు. జిల్లాతో సంబం ధం లేని ప్రత్యేక అఽఽధికారితో ఈ అక్రమ దం దాపై విచారణ చేయించాలి’’ అని బాపట్ల పార్టమెంటరీ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు డిమాండు చేశారు. ఈమేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ వైఖరితో నష్టాలు, కరోనా కారణంగా ఇబ్బందులు, వీటికి తోడు అఽఽఽధికార పా ర్టీ నాయకులు, అఽధికారుల మామూళ్లతో గ్రానైట్‌ పరిశ్రమల యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన విమర్శించారు. చీమకుర్తి, మా ర్టూరు, బల్లికురవ, సంతమాగులూరు ప్రాంతాల్లో గ్రానైట్‌ అక్రమ రవాణాకు సహకరిస్తూ, దందా చేస్తున్న అధికార పార్టీ నేతలపై జిల్లాకు సంబంధం లే ని ప్రత్యేక అఽఽధికారి చేత విచారణ చేయించాలన్నారు. మైనింగ్‌ రాయిల్టీని ఏ కంగా 40 శాతం పెంచడంతో పరిశ్రమలను నడపలేని దుర్భర పరిస్థితుల్లో యజమానులు ఉన్నారని, ప్రజాసంకల్పయాత్రలో గ్రానైట్‌ పరిశ్రమకు అండ గా ఉంటానన్న ముఖ్యమంత్రి మాటతప్పారని ఆరోపించారు. ఈ రాజకీయ అక్రమ దందాకు అడ్డుకట్ట వేయాలని ఏలూరి డిమాండ్‌ చేశారు.

Updated Date - 2021-06-23T06:50:50+05:30 IST