ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో తీర్మానం చేయాలి

ABN , First Publish Date - 2020-12-04T04:53:09+05:30 IST

రాష్ట్ర అసెంబ్లీ స మావేశాల్లో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ప్రభుత్వం ఏ కగీవ్ర తీర్మానం చేయాలని ఏపీ మాదిగ రిజర్వేషన్‌ పోరా ట సమితి తెలుగు రాష్ట్రాల చై ర్మన్‌ పేరుపోగు వెంకటేశ్వరరా వుమాదిగ డిమాండ్‌ చేశారు.

ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో తీర్మానం చేయాలి
మాట్లాడుతున్న వెంకటేశ్వరరావుమాదిగ


ఒంగోలు (కార్పొరేషన్‌) డి సెంబరు 3 : రాష్ట్ర అసెంబ్లీ స మావేశాల్లో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ప్రభుత్వం ఏ కగీవ్ర తీర్మానం చేయాలని ఏపీ మాదిగ రిజర్వేషన్‌ పోరా ట సమితి తెలుగు రాష్ట్రాల చై ర్మన్‌ పేరుపోగు వెంకటేశ్వరరా వుమాదిగ డిమాండ్‌ చేశారు. గురువారం ఒంగోలులోని ప్రెస్‌క్లబ్‌లోలో రాష్ట్ర కా ర్యదర్శి కావూరి జయకుమార్‌ మాదిగ అధ్యక్షతన సదస్సు జరిగింది. ఈ సంద ర్భంగా వెంకటేశ్వరరావు మాదిగ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై తీర్మానం చేసి పార్లమెంటులో చట్టబద్దతకు కృషి చేయాలని కోరారు. మాదిగ కార్పొరేషన్‌కు అ త్యధికంగా నిధులు కేటాయించాలని, లిడ్‌క్యాప్‌ను పునరుద్ధరించాలని పేర్కొన్నా రు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత దళితులపై దాడులు అధికమ య్యాయని విమర్శించారు. కారెం శివాజీ తన స్వార్ధప్రయోజనాల కోసం మాల, మాదిగల మధ్య గొడవలు పెట్టి పబ్బం గడుపుకుంటున్నారని ఆరోపించారు. స మావేశంలో జిల్లా అధ్యక్షులు దొనకొండ మోషే, అత్తంటి రాజు, నాయకులు పూ నూరి ఏలియా, జడ కృష్టాఫర్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-04T04:53:09+05:30 IST