సర్కారు మద్యం బెల్టుకు..!

ABN , First Publish Date - 2020-12-04T04:49:26+05:30 IST

మద్యం నియంత్రణలో భా గంగా మద్యందుకాణాల సంఖ్యను తగ్గించి ప్రభుత్వమే వాటిని నిర్వహిస్తోంది. సేల్స్‌మెన్‌లు, సూపర్‌వైజర్‌లను నియమించి అమ్మకాలు సాగిస్తోంది.

సర్కారు మద్యం బెల్టుకు..!
మద్యం బాటిళ్లను తరలిస్తూ ప్రమాదానికి గురై పోలీసులకు పట్టుబడ్డ కారు (ఫైల్‌ )

జోరుగా అక్రమ రవాణా దందా 

సూత్రధారులు సేల్స్‌మెన్‌, సూపర్‌వైజర్లు 

అదనపు ఆదాయం కోసం కక్కుర్తి



అద్దంకి, డిసెంబరు 3 : మద్యం నియంత్రణలో భా గంగా మద్యందుకాణాల సంఖ్యను తగ్గించి ప్రభుత్వమే వాటిని నిర్వహిస్తోంది. సేల్స్‌మెన్‌లు, సూపర్‌వైజర్‌లను నియమించి అమ్మకాలు సాగిస్తోంది. ఈ రెండు పోస్టు లకు ఇంటర్వ్యూలు నిర్వహించినప్పటికీ అత్యధిక శా తం అధికార పార్టీ సిఫార్సులతో నియమించినవారే ఉ న్నారు. ఈ నేపథ్యంలో కొందరు  సిబ్బంది  ఇష్టానుసా రం వ్యవహరిస్తున్నారు. బెల్టు షాపులకు మద్యంను అ క్రమంగా చేరవేస్తూ సొ మ్ము చేసుకుంటున్నారు.  ఒక్కో మద్యం దుకాణం లో ముగ్గురు సేల్స్‌మెన్లు, ఒక సూపర్‌వైజర్‌, వాచ్‌ మన్‌ విధులు నిర్వహిస్తు న్నారు. సేల్స్‌మన్‌కు రూ.15వేలు, సూపర్‌వైజర్‌కు రూ. 17500, వాచ్‌మన్‌కు రూ.9వేలు జీతాలను ప్రభుత్వం చెల్లిస్తోంది. ఆ వేతనంతో తృప్తిపడని కొందరు సిబ్బం ది మద్యం బాటిళ్లను రహస్యంగా బెల్టు దుకాణాలకు తరలిస్తూ ఆర్జిస్తున్నారు. ఈక్రమంలో అద్దంకి సర్కిల్‌ పరిధిలో గత ఐదారు నెలల కాలంలో సుమారు 10 మందికి పైగా మద్యం షాపు సిబ్బంది మద్యం తీసుకు వెళ్తూ పట్టుబడ్డారు. పట్టణంలో గత 4 నెలల్లో 4 షా పులలో పనిచేసే ఏడుగురు పట్టుబడ్డారు. అక్టోబరు 2న గాంధీ జయంతి రోజు రామ్‌నగర్‌లో ఉన్న మద్యం షాపులో పనిచేసే సిబ్బంది ముగ్గురు మద్యం తీసుకె ళ్తూ పోలీసులకు చిక్కారు. అదే రోజు సంతమాగులూ రు మండలంలో సిబ్బంది మద్యం  తీసుకువెళ్తూ పట్టు బడ్డాడు.  సెప్టెంబరు, నవంబరులో కూడా పట్టణంలో  ఇద్దరు సిబ్బంది మద్యం బాటిళ్లు తీసుకు వెళ్తూ దొరి కారు. అలాగే గడిచిన మంగళవారం రాత్రి అద్దంకి ప ట్టణంలోని మద్యం షాపులో పనిచేసే సేల్స్‌మన్‌ ఏకం గా కారులో బాటిళ్లు తరలిస్తూ చిక్కాడు.  కారు ప్రమా దానికి గురి కావటంతో మద్యం బాటిళ్ల అక్రమ రవా ణా గుట్టు బయటపడింది. గతంలో బల్లికురవ మండ లం వి.కొప్పెరపాడులో మద్యం షాపులో పనిచేసే వ్యక్తి బెల్ట్‌ షాపు నిర్వాహకుడికి మద్యం అమ్ముతూ దొరికా డు.  మేదరమె ట్లలోని మద్యం  దుకాణంలో పనిచేసే సిబ్బంది కూడా రెండుమూడు సార్లు పట్టుబడ్డారు.  తరచూ మద్యంషాపులలో పనిచేసే సిబ్బంది పోలీ సులకు చిక్కుతున్నారు. మద్యం షాపులలో పనిచేసే సి బ్బంది అదనపు ఆదాయానికి కక్కుర్తిపడి బెల్ట్‌ షాపు లకు మద్యం చేర వేస్తున్నారు. మద్యం తీసుకువెళ్తూ పట్టుబడిన సిబ్బందిని ఉద్యోగం నుంచి తొలగిస్తున్నప్ప టికీ మిగిలినవారు అడ్డదారిలో మద్యం తరలిస్తూనే ఉ న్నారు. ప్రతి రోజు పదుల సంఖ్యలో మద్యం బాటిళ్లు చేరవేస్తున్నారు. మద్యం దుకాణాల సిబ్బంది ప్రమే యం, అండతో బెల్టుషాపులు జోరుగా సాగుతున్నా యన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధి కారులు దృష్టి సారించి మద్యం షాపులలో పనిచేసే సి బ్బందిపై నిఘా పెంచాల్సిన అవసరం ఉంది. 


Updated Date - 2020-12-04T04:49:26+05:30 IST