భారత్‌లో పెట్టుబడులకు చెక్ పెట్టలేదు: Gautam Adani

ABN , First Publish Date - 2022-07-26T16:59:10+05:30 IST

తన పోర్ట్స్ టు ఎనర్జీ(ports-to-energy) వ్యాపార సమ్మేళనానికి సంబంధించిన పెట్టుబడులను భారత్‌(India)లో ఎప్పుడూ తగ్గించింది లేదని..

భారత్‌లో పెట్టుబడులకు చెక్ పెట్టలేదు: Gautam Adani

Gautam Adani : తన పోర్ట్స్ టు ఎనర్జీ(ports-to-energy) వ్యాపార సమ్మేళనానికి సంబంధించిన పెట్టుబడులను భారత్‌(India)లో ఎప్పుడూ తగ్గించింది లేదని.. అలాగని భారతదేశంలో పెట్టుబడుల(Investments)కు చెక్ పెట్టి దూరంగా వెళ్లింది కూడా లేదని భారత కుబేరుడు, అదానీ గ్రూప్‌ సంస్థ అధినేత గౌతమ్‌ అదానీ(Gautam Adani) మంగళవారం వెల్లడించారు. గ్రూప్ వార్షిక వాటాదారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తన గ్రూప్ వృద్ధి అనేది దేశ వృద్ధితో ముడిపడి ఉందని తెలిపారు. 


తాను ఇప్పుడు కొత్త ఇంధన వ్యాపారంలో 70 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెడుతున్నానని.. ఇది భారతదేశాన్ని చమురు నికర దిగుమతిదారు నుంచి గ్రీన్ హైడ్రోజన్(Green Hydrogen) ఎగుమతిదారుగా మారుస్తుందని అదానీ వెల్లడించారు. ‘‘మేము భారతదేశంలో పెట్టుబడులను ఎన్నడూ తగ్గించలేదు. అలాగని భారత్‌లో పెట్టుబడులకు చెక్ పెట్టనూ లేదు’’ అని గౌతమ్ అదానీ వెల్లడించారు. భారతదేశ వృద్ధిపై తమ సంస్థ విజయం ఆధారపడి ఉందని గ్రూప్ ఎప్పుడూ విశ్వసిస్తూనే ఉంటుందన్నారు. 


అదానీ గ్రూప్ ఇప్పుడు దేశంలో అతిపెద్ద ఎయిర్‌పోర్ట్ ఆపరేటర్‌(Airport Operator)గా ఉందని, హోల్సిమ్(Holcim) కొనుగోలుతో సిమెంట్ వ్యాపారం(Cement Business)లోకి అడుగుపెట్టిందని చెప్పారు. గౌతమ్ అదానీ అనతి కాలంలోనే ప్రపంచంలోనే నాలుగో అత్యంత ధనవంతుడిగా ఎదిగారు. తాజాగా రియల్‌టైమ్‌ బిలియనీర్ల జాబితాను ఫోర్బ్స్‌ ప్రకటించింది. 60 ఏళ్ల ఈ వ్యాపార దిగ్గజం సంపద తాజాగా 115 లక్షల 50వేల కోట్ల డాలర్లకు చేరింది. 104 లక్షల కోట్ల 60వేల కోట్ల డాలర్ల సంపద ఉన్న మైక్రోసాప్ట్‌ వ్యవస్థాకుడు బిల్‌గేట్స్‌ను సైతం గౌతమ్‌ అదానీ వెనక్కి నెట్టేశారు. 

Updated Date - 2022-07-26T16:59:10+05:30 IST