Maheshbabu పుత్రోత్సాహం

Published: Fri, 27 May 2022 18:09:49 ISTfb-iconwhatsapp-icontwitter-icon
Maheshbabu పుత్రోత్సాహం

సూపర్ స్టార్ మహేశ్ బాబు (Maheshbabu) ఇటీవల ‘సర్కారువారి పాట’ (Sarkaruvaari paata) చిత్రంతో డీసెంట్ హిట్ అందుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా మంచి వసూళ్ళనే రాబట్టింది. దీని తర్వాత మహేశ్ త్రివిక్రమ్ (Trivikram) దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. జూలైలో చిత్రం సెట్స్ పైకి వెళ్ళబోతోంది. ఈ గ్యాప్‌లో మహేశ్ తన ఫ్యామిలీతో యూరప్ వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. మహేశ్ బాబు, ఆయన భార్య నమ్రతా శిరోద్కర్ (Namratha Sirodkar), కొడుకు గౌతమ్ కృష్ణ (Gowtham Krishna), కూతురు సితార (Sithara).. యూరోప్ లోని వివిధ ప్రదేశాలను సందర్శిస్తూ ఈ వేసవిలో సేదతీరుతున్నారు. ప్రస్తుతం వీరు జెర్మనీలోని ఫేమస్ బ్రెన్నర్స్ పార్క్ హోటల్‌లో బస చేస్తున్నారు. ఈ సందర్భంగా మహేశ్ నిన్న(గురువారం) అక్కడున్న ఓ హోటల్ నుంచి లంచ్ బ్రేక్‌లో తన ఫ్యామిలీతో దిగిన సెల్ఫీ ఒకటి షేర్ చేసి.. ఒక శుభవార్త అభిమానులతో పంచుకున్నారు. 


మహేశ్ బాబు తన కుమారుడు గౌతమ్ క‌ృష్ణ తన హైస్కూల్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడని, దానికి తనెంతో గర్వపడుతున్నానని తన ఇన్‌స్టా ఖాతా ద్వారా తెలియచేశారు. దీంతో ఘట్టమనేని వారి అభిమానులు ఎంతగానో ఖుషీ అవుతున్నారు. ఇది నిజంగా మహేశ్ ఫ్యామిలీకి సెలబ్రేషన్ లాంటిదే. నిన్ననే (గురువారం) 10th క్లాస్ (10th class) రిజల్ట్స్ వచ్చాయి. గౌతమ్ అందులో అదరగొట్టాడని తల్లి దండ్రులు మహేశ్, నమ్రతా ఇద్దరూ తెగ ఆనందపడిపోతున్నారు. అభిమానులు సైతం అతడి ప్రతిభకు మురిసిపోతున్నారు.  2006 ఆగస్ట్ 31న పుట్టిన గౌతమ్ కృష్ణ కొద్ది రోజుల్లో పదహారేళ్ళు పూర్తి చేసుకుంటాడు. ఈ అకాడమిక్ ఇయర్ నుంచి గౌతమ్ ఇంటర్నీడియేట్‌లోకి ఎంటర్ అవుతాడు. ప్రస్తుతం ఈ ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అభిమానులనుంచి మంచి కామెంట్స్ వస్తున్నాయి. 


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International