విజయ్ దేవరకొండతో 'జెర్సీ' డైరెక్టర్..?

Jun 8 2021 @ 09:07AM

విజయ్ దేవరకొండతో 'జెర్సీ' ఫేమ్ గౌతమ్ తిన్ననూరి ఓ సినిమా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు వార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈయన ప్రస్తుతం బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్‌తో 'జెర్సీ' హిందీ రీమేక్ రూపొందిస్తున్నాడు. ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రాం చరణ్‌తో ఓ సినిమా చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడని ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే దీనికన్నా ముందే విజయ్‌తో ఒక ప్రాజెక్ట్ చేయనున్నాడట. ప్రస్తుతం ఈ యంగ్ హీతో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ 'లైగర్' చేస్తున్నాడు. ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ నిర్మిస్తున్నాయి. దీని తర్వాత సుకుమార్ సినిమా ఉండే అవకాశాలున్నాయి. ఆ తర్వాత విజయ్ - గౌతమ్ తిన్ననూరిల ప్రాజెక్ట్ మొదలయ్యే అవకాశాలున్నాయట. ఇందుకు సంబంధించిన అఫీషియల్ న్యుస్ ఎప్పుడు రానుందో చూడాలి. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.