
హైదరాబాద్: తెలంగాణ అటవీశాఖ పీసీసీఎఫ్ గా పనిచేస్తూ సోమవారం పదవీ విరమణ పొందిన అధికారి ఆర్.శోభను తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా (అటవీ వ్యవహారాలు) నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆర్. శోభ ప్రభుత్వ సలహాదారుగా (అటవీ వ్యవహారాలు) రెండేళ్ల పాటు కొనసాగనున్నారు. ప్రభుత్వ సలహాదారుగా శోభ నియామకాన్ని పదవీ విరమణ, సన్మాన కార్యక్రమంలో అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రకటించారు.
ఇవి కూడా చదవండి