జిరాఫీకి జీపీఎస్ ట్రాకర్.. కారణం ఏంటంటే...

ABN , First Publish Date - 2020-11-18T03:49:28+05:30 IST

ఓ జిరాఫీకి జీపీఎస్ ట్రాకర్ అమర్చారు. అది ఎక్కడికెళుతోందా అని ప్రతి క్షణం నిఘా పెట్టారు. అయితే ఇదంతా ఆ జిరాఫీ పారిపోతుందేమోననే అనుమానంతో...

జిరాఫీకి జీపీఎస్ ట్రాకర్.. కారణం ఏంటంటే...

నైరోబీ: ఓ జిరాఫీకి జీపీఎస్ ట్రాకర్ అమర్చారు. అది ఎక్కడికెళుతోందా అని ప్రతి క్షణం నిఘా పెట్టారు. అయితే ఇదంతా ఆ జిరాఫీ పారిపోతుందేమోననే అనుమానంతో కాదు. దానిని కాపాడడానికి. అవును ఆ జిరాఫీ ప్రపంచంలోనే అత్యంత అరుదైన జిరాఫీ. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఏకైక తెల్ల జిరాఫీ అది. వేటగాళ్ల బారి నుంచి దానిని రక్షించేందుకే ఈ జీపీఎస్ ట్రాకర్‌ను అమర్చారు. కెన్యాలో సాధారణంగానే వన్యప్రాణులను వేటాడే వేటగాళ్లు అధికంగా ఉంటారు. వారి బారి నుంచి రక్షించేందుకే దీనికి జీపీఎస్ ట్రాకర్‌ అమర్చామని అధికారులు చెబుతున్నారు.


ఇదిలా ఉంటే జన్యు లోపం కారణంగానే ఈ జిరాఫీ ఇలా తెల్లరంగులో ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఇది మగ జిరాఫీ అని, ప్రపంచంలో ఇదే చిట్టచివరి తెల్ల జిరాఫీ అని, అందుకే దీనిని కాపాడుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నామని చెబుతున్నారు.

Updated Date - 2020-11-18T03:49:28+05:30 IST