నేటి నుంచి ఉపాధ్యాయ, పట్టభద్రుల ఓటర్ల నమోదు

ABN , First Publish Date - 2022-10-01T09:56:45+05:30 IST

పట్టభద్రులు-ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటర్ల నమోదు ప్రక్రియ శనివారం నుంచి ప్రారంభం కానుంది. 2023 మార్చి 29 నాటికి రాష్ట్రంలో ఐదుగురు ఎమ్మెల్సీల పదవీ కాలం ముగుస్తుండడంతో ఓటర్ల నమోదు ప్రక్రియకు కేంద్ర ఎన్నికల

నేటి నుంచి ఉపాధ్యాయ, పట్టభద్రుల ఓటర్ల నమోదు


పట్టభద్రులు-ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటర్ల నమోదు ప్రక్రియ శనివారం నుంచి ప్రారంభం కానుంది. 2023 మార్చి 29 నాటికి రాష్ట్రంలో ఐదుగురు ఎమ్మెల్సీల పదవీ కాలం ముగుస్తుండడంతో ఓటర్ల నమోదు ప్రక్రియకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ప్రకటన చేసింది. ఈమేరకు అక్టోబరు 1నుంచి పట్టభద్రులు, ఉపాధ్యాయ ఓటర్ల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియకు బహిరంగ ప్రకటన జారీ చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఎన్నికల సంఘం ఆదేశాలిచ్చింది. నవంబరు 7 నుంచి ఫారం 18 దరఖాస్తులు స్వీకరించాలని, 23 నాటికి ఓటర్ల ముసాయిదా జాబితా ప్రకటన, డిసెంబరు 30నాటికి తుది జాబితా రూపొందించాలని ఆదేశాలు జారీ చేసింది.

Updated Date - 2022-10-01T09:56:45+05:30 IST