లక్ష్యం కన్నా అధికంగా ధాన్యం సేకరణ: గంగుల

Published: Sat, 29 Jan 2022 02:07:25 ISTfb-iconwhatsapp-icontwitter-icon
లక్ష్యం కన్నా అధికంగా ధాన్యం సేకరణ: గంగుల

హైదరాబాద్‌, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం కన్నా అధికంగా  రాష్ట్రంలో ధాన్యం సేకరించినట్లు  మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు. దేశవ్యాప్తంగా సకరించిన 593 లక్షల మెట్రిక్‌ టన్నుల్లో 70 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణతో తెలంగాణ మూడో స్థానంలో ఉందని శుక్రవారం ఓ ప్రకటనలో పే ర్కొన్నారు. కొనుగోలు కేంద్రాలకు రైతులు తీసుకొచ్చిన ప్రతి ధాన్యం గింజ ను కొనాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు పౌరసరఫరాల శాఖ ధాన్యం సేకరణ చేస్తుందన్నారు. కేంద్రం నిర్దేశించిన దానికన్నా.. 1.31 లక్ష ల మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యాన్ని ఎక్కువగా ేసకరించామని చెప్పారు. గత ఏడాది కన్నా 21.21 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని అదనంగా ేసకరించామని తెలిపారు. కరోనా పరిస్థితుల సమయంలో 6,872 కొనుగోలు కేంద్రా ల ద్వారా రూ.13,690 కోట్ల విలువగల ధాన్యాన్ని సేకరించినట్లు మంత్రి చెప్పారు. 12.78 లక్షల మంది రైతుల నుంచి వరి ధాన్యం సేకరించి, కనీస మద్దతు ధర చెల్లించినట్లు తెలిపారు. గతం కన్నా 5 కోట్ల అధిక గన్నీ సంచుల్ని సకాలంలో అందుబాటులో ఉంచామని, అకాల వర్షాలతో అక్కడక్కడా తేమ ఇబ్బందులు మినహా ధాన్యం సేకరణను సజావుగా నిర్వహించామన్నారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.