ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలి

ABN , First Publish Date - 2021-12-08T06:55:36+05:30 IST

వరి ధాన్యాన్ని మద్దతుధరకు కొనుగోలు చేయాలని రైతు సంఘం, సీపీఎం నేతలు డిమాండ్‌ చేశారు.

ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలి
చిట్యాలలో ఎన్‌హెచ్‌-65పై రాస్తారోకో చేస్తున్న సీపీఎం నాయకులు

 రైతుసంఘం, సీపీఎం నేతల డిమాండ్‌

హాలియా/ కొండమల్లేపల్లి/ దేవరకొండ/ నిడమనూరు/ నార్కట్‌పల్లి/ చిట్యాల/ పెద్దఅడిశర్లపల్లి/ మర్రిగూడ, డిసెంబరు 7: వరి ధాన్యాన్ని మద్దతుధరకు కొనుగోలు చేయాలని రైతు సంఘం,  సీపీఎం నేతలు డిమాండ్‌ చేశారు. ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలనే డిమాండ్‌తో జిల్లా వ్యాప్తంగా మంగళవారం ఆందోళనలు నిర్వహించారు. హాలియాలో నిర్వహించిన రాస్తారోకోలో రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కూన్‌రెడ్డి నాగిరెడ్డి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం విద్యుత్‌ సంస్కరణల బిల్లును బేషరతుగా రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.  కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి కృష్ణా, శంకర్‌నాయక్‌, రైతు సంఘం జిల్లా కోశాధికారి కత్తి శ్రీనివాసరెడ్డి, రవి, రవీందర్‌ ఉన్నారు.  కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని, యాసంగి వరిపంటకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు కంభాలపల్లి ఆనంద్‌ కోరారు. కొండమల్లేపల్లి మండల పరిధిలోని చిన్నఅడిశర్లపల్లి గ్రామపంచాయతీలో పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో సీపీఎం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు.  రైతులు పండించిన ధాన్యాన్ని కాలయాపన చేయకుండా కొనుగోలు చేసి గిట్టుబాటు ధర కల్పించాలని సీపీఎం దేవరకొండ మండల కార్యదర్శి నల్ల వెంకటయ్య కోరారు. దేవరకొండ ఐకేపీ సెంటర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధర్నా నిర్వహించి మాట్లాడారు. కార్యక్రమంలో సీపీఎం మండల కమిటి సభ్యులు బిజిలి లింగయ్య, నిమ్మల పద్మ, రహీం, పర్వత్‌రెడ్డి, విజయ్‌కృష్ణ, ఎల్లయ్య పాల్గొన్నారు. నిడమనూరులో టీడీపీ, సీపీఎం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మలను దహనం చేశారు. కార్యక్రమంలో కొండేటి శ్రీను, మంద తిరుపతయ్య, కందుకూరి కోటేష్‌, ఆకారపు నరేష్‌, కొమాండ్ల గుర్వయ్య, నాగయ్య, సాయికుమార్‌, శివ, ప్రవీణ్‌ పాల్గొన్నారు. నార్కట్‌పల్లి మండలంలోని ఎల్లారెడ్డిగూడెంలో పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు శ్రీరామోజు వెంకటేశ్వర్లు నేతృత్వంలో సందర్శించింది. కార్యక్రమంలో వైస్‌ఎంపీపీ కల్లూరి యాదగిరి, పార్టీ మండల కార్యదర్శి చెర్కు పెద్దులు, గాలి నర్సింహ, చింతపల్లి బయ్యన్న, కొప్పు శ్రవణ్‌, ఐలయ్య, సైదులు ఉన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలు వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేస్తున్నాయని సీపీఎం జిల్లా నాయకులు జిట్ట నగేష్‌, అవిశెట్టి శంకరయ్య విమర్శించారు. చిట్యాలలో ధర్నా నిర్వహించి అనంతరం భువనగిరి రోడ్‌లో రాస్తారోకో చేశారు. కార్యక్రమంలో అరూరి శ్రీను, ఐతరాజు నర్సింహ్మ, లడె రాములు, నారబోయిన శ్రీనివాస్‌, కత్తుల లింగస్వామి, శీలా రాజయ్య పాల్గొన్నారు. పెద్దఅడిశర్లపల్లి మండలం  అంగడిపేట ఎక్స్‌రోడ్డు వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సీపీఎం, సీపీఐ, టీడీపీ నాయకులు సందర్శించారు. కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి పెరిక విజయ్‌కుమార్‌, సీపీఐ మండల కార్యదర్శి కుంభం జయరాములు, మండల కమిటీ సభ్యులు ఎర్ర లక్ష్మయ్య, అలుగుబెల్లి బాస్కర్‌రెడ్డి, టీడీపీ జిల్లా ప్రదాన కార్యదర్శి వస్కుల కృష్ణయ్య, రైతు సంఘం నాయకలు ధర్మపురం దేవయ్య పాల్గొన్నారు. మర్రిగూడ చౌరస్తా వద్ద సీపీఎం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. అంతకుముందు నాంపల్లి, మర్రిగూడ మండలాల్లో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ధాన్యాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో నాంపల్లి సీపీఎం మండల కార్యదర్శి చంద్రమౌళి, ముత్తిలింగం, ఆకుల వెంకట్రాం, ఏర్పుల యాదయ్య, నీలకంఠం ఉన్నారు. 

Updated Date - 2021-12-08T06:55:36+05:30 IST