ధాన్యం కొనుగోళ్లను పకడ్బందీగా నిర్వహించాలి..కలెక్టర్‌ రవి

ABN , First Publish Date - 2020-10-21T06:01:22+05:30 IST

చివరి ధాన్యం గింజ వరకూ కొనుగోలు చేసే విధంగా కొనుగోలు కేంద్రాలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ రవి అధికారులకు సూచించారు.

ధాన్యం కొనుగోళ్లను పకడ్బందీగా నిర్వహించాలి..కలెక్టర్‌ రవి

కోరుట్ల, అక్టోబరు 20: చివరి ధాన్యం గింజ వరకూ కొనుగోలు చేసే విధంగా కొనుగోలు కేంద్రాలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ రవి అధికారులకు సూచించారు. పట్టణంలోని పద్మనాయక కల్యాణ భవనంలో మంగళవారం జి ల్లా పౌరసరఫరాలు, ఐకేపీ, పీసీయస్‌, ఎఎంసీలల కొనుగోలు కమిటీ సభ్యులకు నిర్వహిచిన శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్‌ పాల్గొని పలు సూచనలు సలహాలను చేశారు. జిల్లాలో 400 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ధా న్యం చెల్లింపులు సకాలంలో అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలి పారు. ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో టార్పాలిన్లు, ప్యాడి క్లీనర్లుతో పాటు ఇతర మౌలిక వసతులను ఇన్‌చార్జులు పర్యవేక్షించాలన్నారు. ప్రస్తుతం జిల్లాలో 1.36 లక్షల ఎకరాల సన్నరకం, 1.46 లక్షల ఎకరాలో దొడ్డు రకం ధాన్యం సాగు వుతుందన్నాడు. జిల్లాలో మెత్తం లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వ స్తుందని అంచనా వేస్తున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసే సమ యంలో నాణ్యతపై కఠిననంగా వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమం లో పౌరసరఫరాల అదికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-21T06:01:22+05:30 IST