ధాన్యం కొనుగోళ్లు ఇంకెప్పుడు?

ABN , First Publish Date - 2020-10-30T10:33:41+05:30 IST

ధాన్యం కొనుగోళ్లు ఇంకెప్పుడు ప్రారంభిస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ గురువారం నిజా మాబాద్‌ జిల్లా నవీపేట మండలంలోని జన్నెపల్లి క్రాసింగ్‌ వద్ద రైతులు రాస్తారోకో నిర్వహించారు.

ధాన్యం కొనుగోళ్లు ఇంకెప్పుడు?

జన్నెపల్లి క్రాసింగ్‌ వద్ద రైతుల రాస్తారోకో


నవీపేట, అక్టోబరు 29 : ధాన్యం కొనుగోళ్లు ఇంకెప్పుడు ప్రారంభిస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ గురువారం నిజా మాబాద్‌ జిల్లా నవీపేట మండలంలోని జన్నెపల్లి క్రాసింగ్‌ వద్ద రైతులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వా రు మాట్లాడుతూ.. 1 శాతం కంటే తాలు ఎక్కువగా ఉన్న ధా న్యాన్ని చన్ని పట్టాలని పేర్కొంటూ నిబంధనల పేరుతో అధికా రులు ధాన్యం కొనుగోళ్లను నిలిపివేశారని అన్నారు. వరి కోతలు చేపట్టి 15 రోజులు దాటినా బినోలా సొసైటీ ఆధ్వర్యంలో జన్నెపల్లి లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో ఇప్పటి వరకు ఒక్క లా రీకి మించి ధాన్యాన్ని కొనుగోలు చేయలేదని వారు పేర్కొన్నారు. ప్రభుత్వం చెప్పినట్టు సన్నరకం ధాన్యం సాగుచేస్తే ఈ సంవత్సరం దోమపోటు, కాటుక తెగుళ్లతో పంటనష్టం తీవ్రంగా జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సన్న రకం ధాన్యానికి క్వింటాలుకు రూ.2వేల మద్దతు ధర ప్రకటిం చాలని వారు డిమాండ్‌ చేశారు.


ఉన్నతాధికారులు వచ్చేవరకు ఆందోళన విరమించేదేలేదని రైతులు పేర్కొనడంతో సుమారు 3గం టల పాటు రోడ్డుపై పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. స మస్య పరిష్కరానికి నిజామాబాద్‌ ఆర్డీవోను పిలిపిస్తామని ఎస్సై యాకూబ్‌, డిప్యూటీ తహసీల్దార్‌ రాజశేఖర్‌ హామీ ఇవ్వడంతో రైతు లు ఆందోళన విరమించారు. రాస్తారోకోలో జన్నెపల్లి, నాడాపూర్‌, గాంధీనగర్‌, సిరన్‌పల్లి గ్రామాలకు చెందిన రైతులతోపాటు బినోలా సొసైటీకి చెందిన డైరెక్టర్‌లు నవీన్‌రావు, మనోహర్‌రావు పాల్గొన్నా రు. అనంతరం జన్నెపల్లిలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో రై తులతో నిజామాబాద్‌ ఆర్డీవో రవి సమావేశం నిర్వహించారు. ధా న్యం కొనుగోళ్లలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తానని ఆయ న రైతులకు హామీ ఇచ్చారు. రైతులు ఆందోళన చెందొద్దని సూచిం చారు. సమావేశంలో తహసీల్దార్‌ లత పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-30T10:33:41+05:30 IST