10 నుంచి ధాన్యం కొనుగోళ్లు

ABN , First Publish Date - 2021-12-05T05:18:23+05:30 IST

ధాన్యం కొనుగోలు ఈ నెల 10 నుంచి చేపడతున్నట్లు పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్‌ షర్మిల తెలిపారు.

10 నుంచి ధాన్యం కొనుగోళ్లు

కర్నూలు(అగ్రికల్చర్‌), డిసెంబరు 4: ధాన్యం కొనుగోలు ఈ నెల 10 నుంచి చేపడతున్నట్లు పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్‌ షర్మిల తెలిపారు. గ్రామైక్య సంఘాలు, డీసీఎంఎస్‌, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల ద్వారా వరి ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని అన్నారు. క్వింటం గ్రేడ్‌-ఎ ధాన్యానికి రూ.1960, సాధారణ రకానికి రూ.1940 చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. నంద్యాల, ఆళ్లగడ్డ, నందికొట్కూరు, ఆదోని, ఆలూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం పరిధిలో 34 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని జాయింట్‌ కలెక్టర్‌కు నివేదిక పంపామన్నారు. ఐదు వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామన్నారు. 

Updated Date - 2021-12-05T05:18:23+05:30 IST