ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి

ABN , First Publish Date - 2021-05-09T05:50:23+05:30 IST

తాటికల్‌ పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో మండలంలోని చీమలగడ్డలో ఏర్పాటు చేసిన కేంద్రంలో ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని మండలంలోని చందుపట్ల గ్రామ రైతులు శనివారం ధర్నా నిర్వహించారు.

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి
నకరేకల్‌లోని చీమలగడ్డ పీఏసీఎస్‌ ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ధర్నా చేస్తున్న రైతులు

నకిరేకల్‌, మే 8 : తాటికల్‌ పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో మండలంలోని చీమలగడ్డలో ఏర్పాటు చేసిన కేంద్రంలో ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని మండలంలోని చందుపట్ల గ్రామ రైతులు శనివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రానికి నెల రోజుల క్రితం తెచ్చిన ధాన్యం కొనుగోలు చేయకుండా అధికారులు వారికి ఇష్టం ఉన్నట్లుగా వ్యవహరిస్తున్నారన్నారు. డబ్బులు ఇచ్చి న వారి ధాన్యం మాత్రమే కొనుగోలుతో తమకు అన్యాయం జరుగుతోందని వాపోయారు. అనంతరం పీఏసీఎస్‌ కార్యాలయం ఎదుట మరోసారి ఆందోళనకు దిగడంతో పీఏసీఎస్‌ చైర్మన పల్‌రెడ్డి మహేందర్‌రెడ్డి రెండు, మూడు రోజుల్లో ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేస్తామని హామీతో రైతులు ఆందోళన విరమించారు. కార్యక్రమంలో బెజవాడ లక్ష్మీనారాయణ, జలెందర్‌రావు, కొమ్ము శ్రీను, రైతులు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోళ్లు వేగం చేయాలి
చిట్యాల రూరల్‌ :
కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని పీఆర్‌పీఎస్‌ రాష్ట్ర అఽధ్యక్షుడు నూనె వెంకటస్వామి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శనివారం ఆయన మండలంలోని తాళ్లవెల్లం ల, ఎలికట్టె, నేరడ, ఉరుమడ్ల, వట్టిమర్తి, వనిపాకల గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. కొనుగోళ్లలో జాప్యంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నందున కొనుగోళ్లు వేగవంతం చేయాలన్నారు. అదేవిధంగా ధాన్యం కాంటా వేసిన వారం రోజులకే రైతుల ఖాతాలో డబ్బులు జమచేయాలని డిమాండ్‌ చేశారు. ఆయన వెంట నాగిళ్ల యాదయ్య, నీలకంఠం నరేష్‌, పబ్బు చంద్రశేఖర్‌, పోశబోయిన నర్సింహయాదవ్‌,   స్వామి, వడ్డేపల్లి యాదయ్య, పంగరెక్క కృష్ణయ్య, ఉయ్యాల లింగస్వామిగౌడ్‌, మేడి గణేష్‌, నర్సింహగౌడ్‌ పాల్గొన్నారు.
 ధాన్యం వెంటనే మిల్లులకు తరలించాలి : చంద్రశేఖర్‌
మిర్యాలగూడ :
కరోనా సెకండ్‌ వేవ్‌ తీవ్రత, మారుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని వెంటనే రైస్‌మిల్లులకు తరలించాలని అదనపు కలెక్టర్‌ వనమాల చంద్రశేఖర్‌ ఆదేశించారు. శనివారం ఆయన ఎమ్మెల్యే భాస్కర్‌రావు కలిసి ధాన్యం తరలింపు విషయమై సివిల్‌ సప్లై, మార్కెటింగ్‌, రెవెన్యూ అధికారులు, రైస్‌మిల్లర్లతో  స్థానిక ఆర్డీవో కార్యాలయంలో సమీ క్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐకేపీ, పీఏసీఎస్‌ కేంద్రా ల్లో నిల్వ ఉన్న ధాన్యాన్ని త్వరగా కాంటాలు వేసి మిల్లులకు తరలించాలన్నారు. సమావేశంలో ఆర్డీవో రోహితసింగ్‌ , ఏఎంసీ చైర్మన చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, మిల్లర్స్‌ అసోసియేషన అధ్యక్షుడు కర్నాటి రమేష్‌, డీటీ  రామకృష్ణారెడ్డి, మిల్లర్లు కుశలయ్య, మధుసూదన పాల్గొన్నారు.

Updated Date - 2021-05-09T05:50:23+05:30 IST