ధాన్యం బస్తాలను తొందరగా అన్‌లోడ్‌ చేయాలి

ABN , First Publish Date - 2021-05-11T06:42:02+05:30 IST

గల ఏఆర్‌ఎస్‌ రైస్‌మిల్లు, ఆగ్రో ఇండస్ట్రీలను, జీసీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధా న్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్‌ రాంబాబు సోమవారం సా యంత్రం పరిశీలించారు.

ధాన్యం బస్తాలను తొందరగా అన్‌లోడ్‌ చేయాలి
ఖానాపూర్‌ మండలంలోని సత్తనపెల్లి రైస్‌మిల్లులో పరిశీలిస్తున్న కలెక్టర్‌

ఖానాపూర్‌ రూరల్‌, మే 10 : ఖానాపూర్‌ మండలంలోని సత్తనపెల్లిలో గల ఏఆర్‌ఎస్‌ రైస్‌మిల్లు, ఆగ్రో ఇండస్ట్రీలను, జీసీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధా న్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్‌ రాంబాబు సోమవారం సా యంత్రం పరిశీలించారు. కొనుగోల్లు వేగవంతం చేయాలని, రైతులకు ఇబ్బంది కలుగకుండా చూడాలని చెప్పారు. 12 వేల మెట్రిక్‌ టన్నుల నిల్వ సామర్థ్యం ఉన్న రైస్‌మిల్లులో లారీలో వచ్చిన ధాన్యం బస్తాలను వెంటనే అన్‌లోడ్‌ చేయాలని నిర్వాహకులకు సూచించారు. వచ్చిన లారీలు రైస్‌మిల్లు వద్ద ఎక్కువ సమయం ఆపవద్దని చెప్పారు. ఆయన వెంట ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీటీ ప్రకాష్‌, సిబ్బంది ఉన్నారు.

ఆశావర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలి

నిర్మల్‌ టౌన్‌, మే 10 : కరోనా మహమ్మారి నియంత్రణలో కీలకపాత్ర పోషి స్తున్న ఆశావర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని తెలంగాణ వాలంటరీ కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. 


Updated Date - 2021-05-11T06:42:02+05:30 IST