గ్రామ స్వరాజ్యం నిర్వీర్యం

ABN , First Publish Date - 2022-10-03T05:10:01+05:30 IST

జాతిపిత మహాత్మాగాంధీ కలలు గన్న గ్రామ స్వర్యాజ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి అన్నారు.

గ్రామ స్వరాజ్యం నిర్వీర్యం
ఎమ్మిగనూరులో వినతి పత్రం ఇస్తున్న మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి

మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి
గాంధీ విగ్రహానికి క్షీరాభిషేకం
సర్పంచులతో కలిసి వినతి పత్రం

ఎమ్మిగనూరు, సెప్టెంబరు 2:
జాతిపిత మహాత్మాగాంధీ కలలు గన్న గ్రామ స్వర్యాజ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి అన్నారు. పంచాయతీ నిధులు పక్కదారి పట్టించడాన్ని నిరసిస్తూ పట్టణంలోని గాంధీ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి, 11 డిమాండ్లతో కూడిన వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో సర్పంచులు స్వామి, మహేశ్వరి, నాయకులు మాధవరావు దేశాయ్‌, కాశీంవలి, నారాయణరెడ్డి, ధర్మపురం గోపాల్‌, కొండయ్య చౌదరి, మిఠాయి నరసింహులు, కౌన్సిలర్లు దయాసాగర్‌, రామదాసు గౌడ్‌, సుందరరాజు, మల్లి, గాజుల సుధాకర్‌ పాల్గొన్నారు.

గాంధీ విగ్రహానికి వినతి పత్రం

కోడుమూరు:
గాంధీ జయంతి సందర్భంగా ఆదివారం గాంధీ విగ్రహానికి సర్పంచు భాగ్యరత్న వైసీపీ ఉప సర్పంచు మాదన్నతో కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ మాట్లాడుతూ 14, 15వ ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించి పంచాయతీల అభివృద్ధికి నిరోధకంగా మారిందన్నారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు షఫీ, నాగేంద్ర వైసీపీ నాయకులు లింగమయ్య, టీడీపీ నాయకులు మౌళి పాల్గొన్నారు.

విన్నూత రీతిలో నిరసన

ఆలూరు: పట్టణంలోని అంబేడ్కర్‌ కూడలిలో సర్పంచులు నోటికి నల్లగుడ్డ, చేతులకు తాళ్లు కట్టుకొని వైసీపీ ప్రభుత్వ తీరుపై నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆలూరు, మొలగవల్లి, పెద్ద హోత్తుర్‌ గ్రామ సర్పంచులు అరుణాదేవి, మోహన్‌ రాజు, జొహరాపురం లక్ష్మన్న మాట్లాడుతూ గ్రామ పంచాయతీల నిధులు తీసేసుకుంటే గ్రామాలలో నెలకొన్న సమస్యలు ఏ విధంగా పరిష్కరించుకోవాలని ప్రశ్నించారు. ప్రభుత్వం తక్షణమే ఆర్థికం సంఘం నిధులను తిరిగి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ చిన్న యాదవ్‌, టీడీపీ నాయకులు అనిల్‌, బెంగళూరు కిషోర్‌, పెద్దహోతూరు లక్ష్మన్న, గుండన్న పాల్గొన్నారు.

Updated Date - 2022-10-03T05:10:01+05:30 IST