ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

ABN , First Publish Date - 2022-08-20T05:22:10+05:30 IST

పట్టణంలోని పలు దేవాలయాలలో శ్రీకృష్ణాష్టమి వేడుకలను శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. లక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు.

ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు
హరినామ సంకీర్తన చేస్తున్న ఇస్కాన భక్తులు

ధర్మవరం, ఆగస్టు 19: పట్టణంలోని పలు దేవాలయాలలో శ్రీకృష్ణాష్టమి వేడుకలను శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. లక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. గోపూజ  ఉట్టికొట్టు కార్యక్రమం నిర్వహించారు. అలాగే  చెన్నకేశవస్వామి ఆలయం ఎదుట శ్రీకృ ష్ణుడి ప్రతిమను ఏర్పాటుచేసి పూజలు చేశారు. వేణు గోపాల స్వామి ఆలయంలో శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు చేశారు. చెన్నకేశవస్వామి ఆలయ చైర్మన సుబ్రహ్మణ్యం, డైరెక్టర్‌ పొరాళ్ల పద్మావతి, సత్రశాల అశ్వత్థ, అన్నమయ్య సేవామండలి అధ్యక్షుడు పొరాళ్ల పుల్లయ్య, సభ్యులు పాల్గొన్నారు. యాదవవీధి వేణు గోపాలస్వామి ఆలయంలో స్వామి వారికి పూజలు నిర్వహించి, శ్రీకృష్ణుడి ప్రతిమను ఊరేగించారు. అలాగే  ధర్మవరం మండల పరిధిలోని నాగలూరులో ఉన్న రూపారాజ పీసీఎంఆర్‌ పాఠశాలలో విద్యార్థుల రాధాకృష్ణ, గోపికల వేషధారణ ఆకట్టుకుంది.   పాఠశాల చైర్మన హర్షవర్దన, డైరెక్టర్లు రూపరాజకృష్ణ, జగదీశ, కరస్పాండెంట్‌ నాగమోహనరెడ్డి, ప్రిన్సిపాల్‌ శైలజారెడ్డి, ఉపాధ్యాయుల పాల్గొన్నారు.

ధర్మవరంరూరల్‌: పట్టణంలోని మాధవనగర్‌లో ఉన్న ఇస్కాన భజన కుటీరంలో శుక్రవారం శ్రీకృష్ణజన్మాష్టమి వేడుకలను కన్నులపండువగా నిర్వ హించారు. జగన్నాథ, సుభద్ర, బలరామ ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా అ లంకరించి, ప్రత్యేక పూజలు చేశారు.  పెద్దఎత్తున పట్టణవాసులు తరలివచ్చి స్వామివార్లను దర్శనం చేసుకున్నారు. శనివారం ఇస్కాన సంస్థాపనాచా ర్యులు శ్రీలప్రభుపాదుల వారి 126వ వ్యాసపూజ మహోత్సవం నిర్వహిస్తు న్నట్లు ఇస్కానమందిరం శిక్ష గురువు శ్రీకృష్ణమాధవదాస్‌  తెలిపారు. 

తాడిమర్రి: కృష్ణాష్టమిని పురస్కరించుకుని శుక్రవారం మండలంలోని  పలు గ్రామాల్లో చిన్నారులకు కృష్ణుడి వేషాలు వేయించి, కోలాటాలు ఆడించా రు. చిన్నారులను ఆలయాలకు తీసుకెళ్లి పూజలు నిర్వహించారు.

పుట్టపర్తి/పుట్టపర్తిరూరల్‌: కృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకొని పుట్టపర్తిలోని శివాలయం వీధిలో చిన్నారులను గోపికా, కృష్ణుల వేషధారణ లతో అలంకరించారు. వారి అటపాటలతో సంబరాలు జరుపుకున్నారు. అలా గే మండల వ్యాప్తంగా వేణుగోపాలస్వామి ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజ లు నిర్వహించారు. సాయంత్రం ఉట్టికొట్టే కార్యక్రమాలు నిర్వహించి, రంగోళి ఆడారు. వేణుగోపాల స్వామి ఉత్సవ విగ్రహాలను ఊరేగించారు.

ముదిగుబ్బ: ముదిగుబ్బమండల పరిధిలోని బ్రహ్మదేవరపల్లికొట్టాలలో శ్రీకృష్ణాష్టమి వేడుకల ను జాతీయ అఖిల భారత యాదవ సంఘం యువ జన ఉపాఽధ్యక్షుడు ఆదినారాయణ యా దవ్‌ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం శ్రీకృష్ణుడి ప్రతిమ ఊరేగింపు, ఉట్టికొట్టే కార్యక్రమం చేపట్టారు. 

కొత్తచెరువు(బుక్కపట్నం): కొత్తచెరువులోని మరువ ఆంజనేయస్వా మి దేవాలయంలో ప్రబోధానంద సేవాసమితి ఆధ్వర్యంలో శ్రీకృష్ణా ష్టమి  వేడుకలు శుక్రవారం ప్రారంభమయ్యా యి. ఏడో రోజు కృష్ణుడి ప్రతిమను ఊరేగి స్తామని సమితి సభ్యులు  నాగేంద్ర, అలివేల మ్మ, శాంతి, పెద్దక్క తదితరులు తెలిపారు.

కదిరి: పట్టణంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను శుక్రవారం యాదవ సం ఘం, స్థానిక భవనాశి ఆశ్రమం, గీతామందిరం ఆధ్వర్యంలో ఘనంగా జరిపా రు. ఈ సందర్భంగా శ్రీకృష్ణ రథాన్ని మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్ర సాద్‌, సీపీఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్‌ ప్రారంభించారు.  తిరువీఽ దుల్లో గ్రామోత్సవం  సందడిగా సాగింది.  యాదవ సంఘం నాయకులు డీ శ్రీరామయాదవ్‌, రాంప్రసాద్‌యాదవ్‌,  మీసా శ్రీనివాస యాదవ్‌, నాగరాజు యాదవ్‌, ఆంజనేయులు యాదవ్‌, విజయభాస్కర్‌ యాదవ్‌, సూరీడు, రామమోహన, గంగాధర్‌, క్రిష్టప్ప, డివిజనలోని యాదవులు పాల్గొన్నారు. 

కదిరి అర్బన: పట్టణంలోని కోనేరు వద్ద ఉన్న గీతామందిరంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు అన్నదానం, సాయంత్రం గ్రామోత్సవం నిర్వహించారు. అలాగే పట్టణంలోని భవిష్య పాఠశాలలో  శ్రీకృష్టా,గోపికల వేషధారణలో అలరించారు. ప్రధానోపాధ్యాయు డు ఈశ్వర్‌, కరెస్పాండెంట్‌ మాధవి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 

ఓబుళదేవర చెరువు: మండలంలోని రామయ్యపేట గీతామందిరంలో శ్రీకృష్టమి వేడుకలను యాదవ్‌ సంఘం ఆధ్వర్యంలో ఆ సంఘం మండలా ధ్యక్షుడు డ్రిప్‌ నాగరాజు, కంచి సురేష్‌, రాజగోపాల్‌ తదితరులు పాల్గొని ఘనంగా నిర్వహించారు. గీతామందిరం నుంచి కృష్ణుడి విగ్రహాన్ని ప్రత్యేక వాహనంలో ఊరేగింపుగా మండల కేంద్రానికి తీసుకొచ్చి, ప్రసాదాలు పంపి ణీ చేశారు. మధ్యాహ్నం గీతామందిరం వద్ద అన్నదానం నిర్వహించారు. 

నల్లచెరువు: మండలకేంద్రంలోని వేణుగోపాల దేవాలయంలో శుక్రవారం శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా కృష్ణుడికి ప్రత్యేక పూజలు చేసి, అన్నదా నం నిర్వహించారు. ఈ పూజలకు టీడీపీ కదిరి నియోజకవర్గం ఇనచార్జ్‌ కం దికుంట వెంకటప్రసాద్‌ హాజరయ్యారు. ఆలయ కమిటీ సభ్యులు ఆయనను దుశ్శాలువతో సత్కరించారు. ఆయన ఆలయ అభివృద్ధికి గతంలో రూ.లక్ష ఇచ్చారని, కృష్ణాష్టమి సందర్భంగా రూ.50వేలు విరాళం అందించనట్లు కమి టీ సభ్యుడు దాదెం శివారెడ్డి తదితరులు తెలిపారు. 

గాండ్లపెంట: మండలంలోని ఆదర్శ పాఠశాలలో  కృష్ణుడి వేషధారణలో చి న్నారులు ఆకట్టుకున్నారు. చిన్నారులు ఉట్టి కొట్టే కార్యక్రమం నిర్వహించారు. 

అమడగూరు: మండల వ్యాప్తంగా కృష్ణాష్టమి సందర్భంగా చిన్నారులను కృష్ణుడు, గోపికల వేషధారణలో అలంకరించి, ఉట్లు కోట్టే కార్యక్రమాన్ని నిర్వ హించారు. అనంతరం భక్తి పాటలు, సంస్కృతి కార్యక్రమాలు నిర్వహించారు. 

నల్లమాడ: మండలంలోని గోపేపల్లి, మసకవంకపల్లిల్లో కృష్ణాష్టమి వేడుక లు ఘనంగా నిర్వహించారు. శ్రీకృష్ణుడి చిత్రపటాన్ని ఊరేగించారు. 

తనకల్లు: మండలంలోని రాకుంటపల్లిలో శుక్రవారం రాత్రి కృష్ణుడి చిత్ర ప టం ఊరేగించారు. అన్నదానం చేశారు. యాదవులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-20T05:22:10+05:30 IST