గ్రాండ్‌ మాస్టర్‌ Bharathకు రూ.8లక్షల కానుక

Published: Fri, 21 Jan 2022 08:12:10 ISTfb-iconwhatsapp-icontwitter-icon
గ్రాండ్‌ మాస్టర్‌ Bharathకు రూ.8లక్షల కానుక

చెన్నై: పధ్నాలుగేళ్లలోపే చదరంగంలో అత్యంత ప్రతిభాపాటవాలు ప్రదర్శించి, గ్రాండ్‌ మాస్టర్‌ టైటిల్‌ గెలుచుకున్న రాష్ట్ర చదరంగపు క్రీడాకారుడు భరత్‌ సుబ్రమణ్యంకు ముఖ్యమంత్రి ఎంకే సాట్లఇన్‌ రూ.8లక్షల నగదు కానుక అందజేశారు. సచివాలయంలో గురువారం ఉదయం భరత్‌, అతడి తల్లిదండ్రులు స్టాలిన్‌ను కలుసుకున్నారు. ఆ సందర్భంగా  అంతర్జాతీయ చదరంగ పోటీల్లో పాల్గొని గ్రాండ్‌ మాస్టర్‌ టైటిల్‌ను గెలుచుకున్న విధానం గురించి స్టాలిన్‌ అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత 2019లో ఇంటర్‌నేషనల్‌ చెస్‌మాస్టర్‌ టైటిల్‌  గెలుచుకున్నందుకు రూ.3 లక్షలు, 2022లో గ్రాండ్‌ మాస్టర్‌ టైటిల్‌ను గెలుచుకున్నందుకు రూ.5 లక్షలు చొప్పున మొత్తం రూ.8లక్షల చెక్కును భరత్‌ సుబ్రమణ్యంకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీవీ మెయ్యనాధన్‌, యువజన సంక్షేమం, క్రీడాభివృద్ధి శాఖల ప్రిన్సిపల్‌ సెక్రటరీ అపూర్వ, భరత్‌ కోచ్‌ శ్యామ్‌ సుందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.