బందరులో ‘కొల్లు’కు ఘనస్వాగతం

ABN , First Publish Date - 2020-09-28T17:28:25+05:30 IST

80 రోజుల తరువాత ఇంటికి తిరిగొచ్చిన మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు పార్టీ నేతలు..

బందరులో ‘కొల్లు’కు ఘనస్వాగతం

మచిలీపట్నం(కృష్ణా): 80 రోజుల తరువాత ఇంటికి తిరిగొచ్చిన మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు పార్టీ నేతలు, కార్య కర్తలు ఘనంగా స్వాగతం పలికారు. ఆదివారం రాత్రి విజయవాడ నుంచి బయలుదేరిన ఆయన మధ్యలో సుల్తానగరం ఆంజనేయస్వామిని దర్శిం చుకోవాలనుకున్నారు. దీంతో దేవాలయం వద్ద స్వాగతం పలికేందుకు పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు వేచి ఉన్నారు. కానీ పోలీసులు ఆంక్ష లు విధించటంతో ఆర్‌పేట సీఐ వెంకటేశ్వరరావు సూచనల మేరకు కొల్లు రవీంద్ర నేరుగా ఇంటికి వెళ్లారు. దీంతో సుల్తానగరం వద్ద పెద్దఎత్తున స్వాగతం పలికేందుకు దండలతో వేచిఉన్న కార్యకర్తలు, నేతలు నిరాశకు గురయ్యారు.


అనంతరం వారు కూడా రవీంద్ర నివాసానికి చేరుకున్నారు. కొవిడ్‌ నిబంధనల కారణంగా ర్యాలీలు నిర్వహించవద్దని పోలీసులు ఆంక్షలు పెట్టటంతో కొల్లు రవీంద్రకు ఇంటివద్ద కేవలం పూల దండలతోనే స్వాగతం పలికారు. మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ మోటమర్రి బాబా ప్రసా ద్‌, మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ గోపు సత్యనారాయణ, మాజీ కౌన్సిలర్‌ కొట్టె వెంకట్రావు, మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు, రూరల్‌ పార్టీ అధ్యక్షుడు కుంచే నాని, పట్టణ పార్టీ అధ్యక్షుడు ఎండీ ఇలియాస్‌ పాషా, పట్టణ పార్టీ కార్యదర్శి పిప్పళ్ల కాంతారావు, టీడీపీ జిల్లా కార్యదర్శి పి.వి. ఫణికుమార్‌, మాజీ జడ్పీటీసీ లంకే నారాయణ ప్రసాద్‌, లంకే హరికృష్ణ, కొక్కిలిగడ్డ నాగరమేష్‌, అక్కుమహంతి రాజా పాల్గొన్నారు.


Updated Date - 2020-09-28T17:28:25+05:30 IST