రెండోసారీ కూతురే పుట్టినా ఆ భార్యాభర్తల్లో సంతోషం.. కానీ వారసుడు పుట్టలేదన్న కోపంతో తాత ఎంతపనిచేశాడంటే..

ABN , First Publish Date - 2022-09-15T21:18:43+05:30 IST

కూతురు పుట్టిందంటే సంతోషించే వాళ్ల కంటే.. బాధపడే వాళ్లే ఎక్కువ ఉంటారు. కొందరు కడుపులో ఉండగానే అబార్షన్ చేయిస్తుంటే.. మరికొందరు పుట్టిన తర్వాత చంపడం, చెత్తకుప్పల్లో..

రెండోసారీ కూతురే పుట్టినా ఆ భార్యాభర్తల్లో సంతోషం.. కానీ వారసుడు పుట్టలేదన్న కోపంతో తాత ఎంతపనిచేశాడంటే..
ప్రతీకాత్మక చిత్రం

కూతురు పుట్టిందంటే సంతోషించే వాళ్ల కంటే.. బాధపడే వాళ్లే ఎక్కువ ఉంటారు. కొందరు కడుపులో ఉండగానే అబార్షన్ చేయిస్తుంటే.. మరికొందరు పుట్టిన తర్వాత చంపడం, చెత్తకుప్పల్లో విసిరేయడాన్ని తరచూ చూస్తూనే ఉన్నాం. రాజస్థాన్‌లో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. రెండోసారి కూతురు పుట్టినా భార్యాభర్తల్లో ఎలాంటి బాధా కనిపించలేదు. పైగా చాలా సంతోషపడ్డారు. అయితే వారసుడు పుట్టలేదన్న కోపంతో తాత షాకింగ్ నిర్ణయం (Shocking decision) తీసుకున్నాడు. తీవ్ర చర్చనీయాంశమైన ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..


రాజస్థాన్ (Rajasthan) చురు జిల్లా ఘనౌన్ గ్రామానికి చెందిన రామ్‌కుమార్ (50) కు  రణ్‌వీర్, ముఖేష్‌ అనే కుమారులు ఉన్నారు. కాగా, ముఖేష్‌కు 2019లో వివాహమైంది. తనకు మనమడు పుడతాడని రామ్‌కుమార్ ఎప్పటినుంచో ఆశలు పెట్టుకున్నాడు. అయితే మొదటి కాన్పులో కోడలికి కూతురు పుట్టింది. దీంతో తీవ్ర నిరాశకు లోనయ్యాడు. రెండోసారైనా మనవడు పుడతాడని తనకు తాను సర్దిచెప్పుకొన్నాడు. ఇటీవల ముఖేష్‌ భార్య రెండో సారి గర్భం దాల్చింది. దీంతో తనకు ఈసారి మనువడు పుడతాడని, తనతో ఆడుకోవాలని రామ్‌కుమార్ ఆశలు పెట్టుకున్నాడు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం ఐదు గంటలకు ముఖేష్ భార్య ప్రసవించింది. అయితే మళ్లీ అడపిల్లే పుట్టింది. అయినా ముఖేష్, అతడి భార్య సంతోషంగా ఉన్నారు.

husband love: భర్త పరాయి యువతితో తిరుగుతున్నాడని తెలిసినా స్వాగతించిన భార్య.. చివరకు ఆ యువతి గురించి తెలుసుకుని అవాక్కయిన స్థానికులు..


అయితే రామ్‌కుమార్ మాత్రం తీవ్ర నిరాశకు గురయ్యాడు. పాప పుట్టగానే తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. వెంటనే వెళ్లి ఫుల్‌గా మందు తాగాడు. అనంతరం అదే బాధలో పొలంలోకి వెళ్లి, పురుగుల మందు తాగాడు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు వృద్ధున్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు అక్కడికి చేరుకుని మృతుడి కుటుంబ సభ్యులను విచారించారు. అయితే కేసు నమోదు చేసేందుకు వారు నిరాకరించారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ ఆడపిల్లల పట్ల వివక్ష కొనసాగుతోంది. ఇటీవల ఓ కుటుంబం నవజాత శిశువును ముళ్ల పొదల్లో పడేసింది. అయితే పాప ఏడుపు విని స్థానికులు రక్షించి, ఆస్పత్రికి తరలించారు.

భర్త మంచంపై ఉండగానే.. పక్కన ప్రియుడితో సరదా కబుర్లు చెబుతున్న భార్య.. చివరకు వెలుగులోకి వచ్చిన అసలు విషయం ఏంటంటే..



Updated Date - 2022-09-15T21:18:43+05:30 IST