గ్రావెల్ తవ్వుతున్న దృశ్యం
తవ్వకంపై తీర్మానం లేదన్న కార్యదర్శి
తాడేపల్లిగూడెం రూరల్, జనవరి 21: దండగర్ర వల్లభరాయుడి చెరువులో గ్రావెల్ తవ్వేస్తున్నారు. స్థానిక వైసీపీ నాయకులు తవ్వకం పనుల విషయంలో కీలక పాత్ర పోషిస్తున్నట్టు ఆరోపణలున్నాయి. గురువారం రాత్రి నుంచి చెరువు తవ్వకం పనులు మొదలు పెట్టగా గ్రామంలో ఇది చర్చనీయాంశ మైంది. దీనిపై కార్యదర్శి కృష్ణను వివరణ కోరగా చెరువు తవ్వకంపై పంచాయ తీ ఎలాంటి తీర్మానాలు చేయలేదని తెలపగా తవ్వకందార్లను అడిగితే ఈ గ్రావెల్‌ను ప్రభుత్వ లేఅవుట్లలో రోడ్లు వేసే నిమిత్తం తవ్వుతున్నట్టు తెలిపారు.