తవ్వకాలు జరిపిన ప్రాంతంలో హిందూ సంఘాల ఆందోళన
ఎండోమెంటు అధికారులు ఏం చేస్తున్నట్టు?
మండిపడిన హిందూ సంఘాలు
రాంబిల్లి, మార్చి 27 : ప్రముఖ శైవక్షేత్రం పంచదార్ల కొండపై అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు చేపడుతున్న వారిని కఠినంగా శిక్షించాలని హిందూ సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఫణిగిరి వద్ద తవ్వకాలు జరిపిన ప్రదేశాన్ని ఆదివారం పరిశీ లించి, ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమాధర్మలింగేశ్వరస్వామి ఆలయాన్ని ఆనుకొని ఉన్న కొండ వద్ద కొందరు అక్రమంగా గ్రెవె ల్ తవ్వకాలు జరిపి, తరలించినట్టు ఆరోపించారు. ఇక్కడి ఇలాంటి తవ్వకాలు చేపట్టడం వల్ల కొండలో నుంచి రాధామాధవస్వామి ఆలయంలోకి ప్రవహించే నీటి ధారలు ఆగిపోయే ప్రమాదం ఉందన్నారు. పురాతన, చారిత్రక సంపదను కొందరు అధికార దాహంతో కొల్లగొట్టడం తగదన్నారు. పంచదార్ల కొండపై ఇంత దర్జాగా తవ్వకాలు జరుగుతున్నా అధికారులు స్పం దించకపోవడం ఏమిటని ప్రశ్నించారు. అసలు ఎండో మెంట్ అధికారులు ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తవ్వకాలకు సహకరిస్తున్న అధికారులపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయనున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్వయం సేవక్, సమరసతా సేవా ఫౌండేషన్ కన్వీనర్ పడాల శ్రీరాములు, బీజేపీ ఎలమంచిలి అసెంబ్లీ కన్వీనర్ రాజాన సన్యాసినాయుడు, ఆ పార్టీ నాయకులు అగ్గాల హనుమంతరావు, ధర్మా ల గోవిందరెడ్డి, రాజాన రాజు, ఇబ్రహీమ్బాషా, పి.దాసుబాబు, పప్పు ఈశ్వరరావు, నక్క శివశంకర్, నాగుమంత్రి శ్రీనివాస్, నూకరాజు, జైశంకర్, ఎం.ధనలక్ష్మి, జనసేన పార్టీ మండల అధ్యక్షుడు పప్పల నూకన్నదొర తదితరులు పాల్గొన్నారు.