అన్నదాతకు ఊరట

ABN , First Publish Date - 2022-06-28T05:37:58+05:30 IST

ఎట్టకేలకు రైతు బంధు పథకం కింద అన్నదాతల ఖాతాల్లో మంగళవారం నుంచి డబ్బులు వారి ఖాతాల్లో జమ కాబోతున్నాయి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తమకు సాగుకు పెట్టుబడి సాయం అందుతున్నందుకు అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అన్నదాతకు ఊరట

రైతుబంధు సాయం పంపిణీ సర్వం సిద్ధం
నేటి నుంచి ఖాతాల్లో జమ
మొత్తం రూ. 135.86 కోట్లు విడుదల
గత సీజన్‌లో కన్నా రూ.2.90 కోట్లు అదనం
జిల్లాలో 1.46 లక్షల మందికి లబ్ధి
9వేలకుపైగా పెరిగిన రైతులు


హనుమకొండ, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి) : 
ఎట్టకేలకు రైతు బంధు పథకం కింద అన్నదాతల ఖాతాల్లో మంగళవారం నుంచి డబ్బులు వారి ఖాతాల్లో జమ కాబోతున్నాయి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తమకు సాగుకు పెట్టుబడి సాయం అందుతున్నందుకు అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం రైతుబంధు సాయానికి రైతుల ఖాతాలన్నింటిని రాష్ట్ర ప్రభుత్వం క్లియర్‌ చేసింది. ఖాతాల్లో డబ్బులు జమకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈ సారి రైతు బంఽఽధు సాయం అందడంలో దాదాపు 20 రోజులు ఆలస్యం జరిగింది. వాస్తవానికి మే చివరి వారంలో లేదా జూన్‌ మొదటి వారంలో పెట్టుబడి సాయం రైతులకు అందాల్సి ఉంది. వర్షాలు పడడం మొదలైంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. తొలకరి వర్షాలతోనే రైతులు దుక్కులు దున్నడం మొదలు పెట్టారు. ఈ పాటికే ఎరువులు, విత్తనాల కొనుగోలు చేసి సిద్ధంగా ఉంచుకోవాలసి ఉంది. కానీ  పెట్టుబడి సాయం అందకపోవడంతో అయోమయంలో పడ్డారు. రైతుబంధు కింద ఎకరానికి రూ. 5వేల చొప్పున రావాల్సిన పెట్టుబడి సాయం సకాలంలో రాకపోయే సరికి కలవరపడ్డారు. ఈలోగా ప్రదాన మంత్రి కిసాన్‌ యోజన పథకం కింద ఎకరానికి రూ. 2 వేల చొప్పున ఖాతాల్లో పడడంతో కాస్త ఊరట చెందారు. ఇది కొంత వారిని ఆదుకున్నా.. రైతు బంధు కింద మరో రూ. 5వేలు కూడా పడుతుండడంతో ఊపిరి పీల్చుకున్నారు.

రైతుబంధు సాయం ఇలా..

హనుమకొండ జిల్లాలో రైతు బంధు కింద ఈ సారి పెట్టుడి సాయంగా 163 గ్రామాల్లోని  1,46,184 మంది రైతులకు రూ. 135.86 కోట్లు అందబోతున్నాయి. గత సీజన్‌ కన్నా రూ. 2.90 కోట్లు ఎక్కువ. గత సీజన్‌లో 1,36,822 మంది రైతులకు రూ. 132.96 కోట్ల సాయం పంపిణీ జరిగింది. గతంలో కన్నా  ఈ సారి 9362 మంది రైతులు పెరిగారు. కొత్తపాస్‌ పుస్తకాలు జారీ కావడం, డిజిటల్‌ క్లియరెన్స్‌ వల్ల భూవిస్తీర్ణం పెరగడం తదితర కారణాల వల్ల సాయం మొత్తం పెరిగింది. భీమదేవరపల్లి మండలంలో 12 గ్రామాల్లోని 11003 మంది రైతులకు రూ. 12.45 కోట్లు, ధర్మసాగర్‌ మండలంలోని 13 గ్రామాల్లో 12771 మంది రైతులకు రూ. 13.75 కోట్లు, ఎల్కతుర్తి మండలంలో 13 గ్రామాల్లోని 11839 మంది రైతులకు రూ. 11.27 కోట్లు, హనుమకొండ మండలంలో 6 గ్రామాల్లోని 1939 మంది రైతులకు రూ. 99.01 లక్షలు, హసన్‌పర్తి మండలంలో 18 గామాల్లోని 15634 మంది రైతులకు రూ. 12.31 కోట్లు, ఐనవోలు మండలంలో 10 గ్రామాల్లోని 13461 మంది రైతులకు రూ. 14.09 కోట్లు, కమలాపూర్‌ మండలంలో 16 గ్రామాల్లోని 15544 మంది రైతులకు రూ 14.11 కోట్లు, కాజీపేట మండలంలో 10 గ్రామాల్లోని 8113 మంది రైతులకు రూ. 6.5. కోట్లు, వేలేరు మండలంలో 7 గ్రామాల్లోని 8211 మంది రైతులకు రూ. 9.5 కోట్లు, ఆత్మకూరు మండలంలో 12 గ్రామాల్లోని 10431 మంది రైతులకు 8.5 కోట్లు, దామెర మండలంలో 10 గ్రామాల్లోని 8026 మంది రైతులకు రూ.7.5 కోట్లు, నడికూడ  మండలంలో 12 గ్రామాల్లోని 10386 మంది రైతులకు రూ. 9.30 కోట్లు, పరకాల మండలంలో 11 గ్రామాల్లోని 7790 మంది రైతులకు రూ. 6.37 కోట్లు, శాయంపేట మండలంలో 13 గ్రామాల్లోని  11036 మంది రైతులకు రూ. 9.14 కోట్లు పంపిణీ కానున్నాయి.

వచ్చేనెల 10వ వరకు అవకాశం
ఈనెల 5వ తేదీ వరకు కట్‌ఆ్‌ఫడేట్‌తో కొత్తపా్‌సబుక్కులు అప్‌డేట్‌ అయిన రైతులందరికీ రైతు బంధు సాయం అందనున్నట్టు పత్రికల్లో వార్తలు రావడంతో కొందరు రైతులు ఆందోళన చెందారు. అయితే ఈనెల 22వ వరకు కట్‌ఆ్‌ఫడేట్‌తో అప్‌డేట్‌ అయిన పాస్‌పుస్తకాలకు కూడా పెట్టుబడి సాయం అందనున్నట్టు ప్రభుత్వం జారీ చేసిన తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో అన్నదాతలు కొంత ఊరట చెందుతున్నారు. కొత్తపా్‌సబుక్కులు జారీ అయినా ఇంకా రైతు బంధు పథకం కింద దరఖాస్తు చేసుకోనివారికి కూడా ప్రభుత్వం మరికొంత గడువు ఇచ్చింది. కొత్తపా్‌సబుక్కులు జారీ అయిన రైతులు వచ్చే నెల 10వ తేదీ వరకు తమ పట్టాపా్‌సపుస్తకాలు, బ్యాంకు పాస్‌పుస్తకాలు, ఆధార్‌కార్డు ప్రతులను సంబంధిత వ్యవసాయ విస్తరణాధికారులకు అందచేసినట్లయితే వారికి కూడా రైతు బంధు సాయం అందుతుందని జిల్లా వ్వయసాయశాఖ అదనపు సంచాలకుడు దామోదర్‌ రెడ్డి తెలిపారు. ఈ అవకాశాన్ని వారు ఉపయోగించుకోవాలని కోరారు.

విడతలవారీగా...

ఏకకాలంలో నిధులు సర్దుబాటు చేయడానికి ఆర్ధిక శాఖ ఇబ్బందులు పడుతోంది. ఈ క్రమంలోనే గత రెండు విడతల్లో చేసినట్లుగానే వారం, పది రోజుల వ్యవధి తీసుకొని మొదట ఒకటి, తర్వాత రెండు ఇలా  10 ఎకరాల వరకు పది విడతలుగా నిధులు జమచేయనున్నారు. ఈ క్రమంలోనే కొత్తగా పట్టాదారు పాస్‌ పుస్తకాలు పొందిన రైతులను కూడా లబ్దిదారుల జాబితాల్లో చేర్చనున్నారు.

Updated Date - 2022-06-28T05:37:58+05:30 IST