కేసీఆర్‌ వల్లే పట్టణీకరణలో గొప్ప మార్పులు

ABN , First Publish Date - 2021-11-28T05:07:14+05:30 IST

సీఎం కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత చిన్నచిన్న పట్టణాలుగా ఎదుగుతున్న గ్రామాలను మున్సిపాలిటీలుగా చేసి పట్టణీకరణలో గొప్ప మార్పులు తీసుకువచ్చారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్‌కుమార్‌ పేర్కొన్నారు. శనివారం హుస్నాబాద్‌ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా ఫాస్టెస్ట్‌ మూవర్‌ సిటీ అవార్డు అందుకున్న మున్సిపాలిటీ పాలకవర్గాన్ని అభినందించారు.

కేసీఆర్‌ వల్లే పట్టణీకరణలో గొప్ప మార్పులు

రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌ 


హుస్నాబాద్‌, నవంబరు 27: సీఎం కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత చిన్నచిన్న పట్టణాలుగా ఎదుగుతున్న గ్రామాలను మున్సిపాలిటీలుగా చేసి పట్టణీకరణలో గొప్ప మార్పులు తీసుకువచ్చారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్‌కుమార్‌ పేర్కొన్నారు. శనివారం హుస్నాబాద్‌ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా ఫాస్టెస్ట్‌ మూవర్‌ సిటీ అవార్డు అందుకున్న మున్సిపాలిటీ పాలకవర్గాన్ని అభినందించారు. ఎమ్మెల్యే వొడితెల సతీ్‌షకుమార్‌తో కలిసి చైర్‌పర్సన్‌ ఆకుల రజిత, కమిషనర్‌ రాజమల్లయ్యలను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో 140 మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేశారని, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాన్ని మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్‌ చేశారన్నారు.  హుస్నాబాద్‌ను మంచి పట్టణంగా తీర్చిదిద్దేంతుకు తన వంతు కృషి చేస్తానని వెల్లడించారు. హుస్నాబాద్‌, అక్కన్నపేట మండలాల్లో వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు కొంకటి నళినీదేవి, వాల సుప్రజ, మాజీ ఎంపీపీ ఆకుల వెంకట్‌, గూళ్ల రాజు, గోవిందు రవి, కొంకటి రవీందర్‌, బోజు రమాదేవి, ఎడబోయిన తిరుపతిరెడ్డి, వంగ వెంకట్రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-11-28T05:07:14+05:30 IST