బాంబు పేలుళ్ల మధ్యే వివాహం.. తర్వాత కొద్ది సమయానికే తుపాకులు చేతపట్టిన నవదంపతులు.. వీళ్ల లవ్‌స్టోరీకి నెటిజన్లు ఫిదా!

ABN , First Publish Date - 2022-02-27T00:44:35+05:30 IST

ఒకవైపు తుపాకుల మోత, మరోవైపు బాంబు పెలుళ్లతో దేశం దద్దరిల్లిపోతున్న తరుణంలో ఆ యువతి, యువకుడు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. పెళ్లై గంటలు కూడా గడవకమునుపే నవదంపతులు తుపాకు

బాంబు పేలుళ్ల మధ్యే వివాహం.. తర్వాత కొద్ది సమయానికే తుపాకులు చేతపట్టిన నవదంపతులు.. వీళ్ల లవ్‌స్టోరీకి నెటిజన్లు ఫిదా!

ఇంటర్నెట్ డెస్క్: ఒకవైపు తుపాకుల మోత, మరోవైపు బాంబు పెలుళ్లతో దేశం దద్దరిల్లిపోతున్న తరుణంలో ఆ యువతి, యువకుడు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. పెళ్లై గంటలు కూడా గడవకమునుపే నవదంపతులు తుపాకులు చేతపట్టి, రణరంగంలోకి దిగారు. ప్రస్తుతం ఆ భార్యభర్తలకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాళ్ల ప్రేమ కథ తెలుసుకుని నెటిజన్లు ఫిదా అవుతున్నారు. వారిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలో ఆ నవదంపతుల లవ్‌స్టోరీపై ఓ లుక్కేస్తే.. 


ఉక్రెయిన్‌కు చెందిన యారినా అరివా, స్వియాటోస్లావ్ ఫర్సిన్ తొలిసారిగా 2019 అక్టోబర్‌లో ఒకరికొరు పరిచయమ్యారు. పరిచయం తర్వాత ప్రేమగా మారింది.  కొన్నాళ్లుగా ప్రేమలో మునిగి తేలిన వారిద్దరూ తమ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పి, మే 6న బంధుమిత్రుల సమక్షంలో కొత్త జీవితంలోకి గ్రాండ్‌గా అడుగుపెడదాం అని భావించారు. రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పరిస్థితులు ఒక్కసారిగా తలకిందులయ్యాయి. అప్పటి వరకూ తమ దేశంతో చర్చలు జరుపుతూ వచ్చిన రష్యా.. ఒక్కసారిగా యుద్ధం ప్రకటించడంతో వారి ఆశలు అడియాసలు అయ్యాయి. దీంతో ఆ ప్రేమికులు కీలక నిర్ణయం తీసుకున్నారు. 



భీకర పరిస్థితుల్లో చావైనా.. బతుకైనా కలిసే ఉండాలని భావించారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడులు మొదలు పెట్టిన రోజే.. ఈ ప్రేమికులు ఉన్నఫళంగా పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. ఆ తర్వాత కొద్ది సమయానికే స్థానికంగా ఉన్న డిఫెన్స్ సెంటర్‌కు వెళ్లి, దేశ రక్షణ కోసం తుపాకులు చేతబట్టారు. ఈ సందర్భంగా.. ‘పరిస్థితులు భయానకంగా ఉన్నాయి. మా మాతృభూమి కోసం ఫైట్ చేయాలని బయల్దేరాం. ఈ పోరాటంలో మేము చనిపోవచ్చు. కానీ చనిపోవడానికి ముందు మేమిద్దరం ఒక్కటవ్వాలనుకున్నాం. దేశ రక్షణ కోసం చేయాల్సిందంతా చేసి తీరతాం’ అని ఈ నవదంపతులు చెబుతున్నారు. తుపాకులు చేత పట్టి నవదంపతులు దిగిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ క్రమంలో నెటిజన్లు స్పందిస్తూ ఆ భార్యాభర్తలకు హ్యాట్సాఫ్ చెబుతున్నారు.




Updated Date - 2022-02-27T00:44:35+05:30 IST