ఘనంగా ఎన్టీఆర్‌ జయంతి

ABN , First Publish Date - 2022-05-29T04:29:02+05:30 IST

మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్‌ ఆశయ సాధనకు ఆందరం కృషి చేయాలని కోవూరు మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి పిలుపునిచ్చారు.

ఘనంగా  ఎన్టీఆర్‌ జయంతి
కొడవలూరు : ఎన్టీ ఆర్‌ చిత్ర పటానికి నివాళులర్పిస్తున్న మాజీ శాసన సభ్యుడు పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి , టీడీపీ నాయకులు

మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి 

కొడవలూరు మే 28 :  మాజీ ముఖ్యమంత్రి దివంగత  ఎన్టీఆర్‌ ఆశయ సాధనకు ఆందరం కృషి  చేయాలని కోవూరు మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి పిలుపునిచ్చారు.  ఆయన ఆధ్వర్యాన శనివారం మండలంలోని నార్తురాజుపాళెం పీఎస్‌ఆర్‌ కల్యాణ మండపం నుంచి నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు బైక్‌లపై, కార్లు, వ్యాన్లలో ఒంగోలులో జరుగుతున్న మహానాడుకు బయలుదేరి వెళ్లారు.  తొలుత ఎన్టీఆర్‌ వందో జయంతిని పురస్కరించుకొనిఆయన చిత్ర పటానికి పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డ పాలాభిషేకం చేశారు. రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే నారా చంద్రబాబు నాయుడుతోనే సాధ్యం అన్నారు. కార్యక్రమంలో  కొడవలూరు, విడవలూరు, ఇందుకూరుపేట టీడీపీ మండల అధ్యక్షులు కోటంరెడ్డి అమరేంద్రరెడ్డి, చెముకులు శ్రీనివాసులు, వీరేంద్ర చౌదరి, నాయకులు చెక్కా మదన్‌, కరకటి మల్లికార్జున. గరికపాటి రాజేంద్రకుమార్‌ ,నాసిన ప్రసాద్‌ , నాయకులు కర్యకర్తలు తరలి వెళ్లారు. 

కోవూరు : టీడీపీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టీ రామారావు 99వ జయంతిని పట్టణంలోని ఆ పార్టీ కార్యాలయంలో శనివారం ఘనంగా నిర్వహించారు. టీడీపీ పార్లమెంటు కమిటీ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఎన్టీఆర్‌ స్ఫూర్తితో పనిచేసి రాష్ట్రంలో పార్టీని తిరిగి అధికారంలోని తీసుకురావడానికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో నాయకులు రామారావు, సత్య నారాయణరెడ్డి, శివకుమార్‌, భాస్కర్‌రెడ్డి, మారుబోయిన వెంకటేశ్వర్లు, గోపాల్‌, విజయ్‌, నరసింహ, గోపాల్‌, మురళీకృష్ణరెడ్డి, మహ్మద్‌, ఆదిశేషయ్య, భగవాన్‌, సూర్య, వెంకటేశ్వర్లు, రాంబాబు, వెంకయ్య పాల్గొన్నారు. పడుగుపాడు మజరా చంద్రమౌళి నగర్‌ గిరిజనకాలనీలో ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా ఆయన  విగ్రహానికిపూలమాలలు వేసి నివాళులర్పించారు. టీడీపీ నాయకుడు సూరిశెట్టి శ్రీనివాసులు ఆధ్వర్యంలో జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. 

తోటపల్లిగూడూరు  :  స్థానిక తహసీల్దారు కార్యాలయం ఎదుట ఎన్టీఆర్‌ జయంతి వేడుక ఘనంగా నిర్వహించారు. ముందుగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి పేనాటి భార్గవమ్మ మాట్లాడుతూ తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని నలుమూలలు చాటిన వ్యక్తి ఎన్టీఆర్‌ అని కొనియాడారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు మన్యం జితేంద్ర, తోటపల్లి రామ్మోహన్‌, నిర్మలమ్మ, చైతన్య, శీనయ్య, తదితరులు పాల్గొన్నారు. 

పొదలకూరు : సంగంరోడ్డు పాత పెట్రోలు బంకు కూడలి వద్ద ఎన్టీఆర్‌ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి టీడీపీ మండల నాయకులు తలచీరు మస్తాన్‌బాబు, బొద్దులూరు మల్లికార్జున్‌ నాయుడు, కోడూరు భాస్కర్‌రెడ్డి, అక్కెం సుధాకర్‌రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్‌ కట్‌ చేసి జోహార్‌ ఎన్టీఆర్‌ అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో కోవూరు వెంకటేశ్వర్లు నాయుడు, మల్లినేని వెంకటేష్‌, అరుణమ్మ, పొట్టి సుధాకర్‌, దేవినేని శరత్‌, షేక్‌.మస్తాన్‌బాషా, షేక్‌.ఖాదర్‌బాషా, పి.ప్రభాకర్‌, సాధం గిరీష్‌, గంటా మల్లికార్జున్‌, వెన్నపూస రాజశేఖర్‌రెడ్డి, శ్రీనివాసులు, కాసా వెంకటేష్‌, పొదలకూరు నవీన్‌, బ్రహ్మదేవి చంద్రశేఖర్‌ పాల్గొన్నారు. మండలం నుంచి సుమారు 250 మంది నాయకులు, కార్యకర్తలు, అభిమానులు 40 ప్రత్యేక వాహనాల్లో మహానాడుకు బయలుదేరారు. 

ఇందుకూరుపేట : మండలంలోని యాగర్ల సెంటర్‌లో టీడీపీ నాయకులు మినీ మహానాడును నిర్వహించారు. ఆ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్‌టీ రామారావు శత జయంతి సందర్భంగా నాయకుడు పొన్నెబోయిన చెంచుకిషోర్‌యాదవ్‌ ఆధ్వర్యంలో మహానాడు నిర్వహించారు. ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేకు కట్‌ చేసి కార్యకర్తలు, అభిమానులకు పంచి పెట్టారు. 

ముత్తుకూరు : మండలంలోని బ్రహ్మదేవం కూడలిలో టీడీపీ నాయకులు ఎన్టీఆర్‌ జయంతిని  ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళుల ర్పించారు. అనంతరం పేదలకు అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ మైనార్టీ నాయకులు షేక్‌ ఆలిముత్తు, మాజీ ఎంపీపీ నన్నం దీనయ్య, పల్లాల రవీంద్ర,  విష్ణువర్థన్‌రావు  పాల్గొన్నారు. 

రాపూరు : ఒంగోలులో జరుగుతున్న టీడీపీ పండుగ మహానాడుకు మండలం నుంచి ప్రత్యేక బస్సులో పెద్ద సంఖ్యలో తెలుగుతమ్ముళ్లు తరలివెళ్లారు. జై  తెలుగుదేశం, జైజై చంద్రబాబు, కురుగొండ్ల నాయకత్వం వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు. 

బుచ్చిరెడ్డిపాళెం : బుచ్చిరెడ్డిపాళెం పట్టణంతోపాటు మండలం నుంచి  టీడీపీ నాయకులు, కార్యకర్తలు 200 మంది ఒంగోలులో జరుగుతున్న మహానాడుకు తరలి వెళ్లారు. మండల అధ్యక్షుడు ఎంవీ. శేషయ్య  జెండా ఊపి ప్రారంభించడంతో  కార్లలో  బయలుదేరి వెళ్లారు. టీడీపీ నాయకులు హరికృష్ణ, రామానాయుడు, హరనాథ్‌, కోటి తదితరులు పాల్గొన్నారు.

చేజర్ల : చేజర్ల బస్టాండు సముదాయంలో ఉన్న ఎన్‌టీఆర్‌ విగ్రహానికి సీనియర్‌ నాయకులు రావి లక్ష్మీనరసారెడ్డి, నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. నాగులవెల్లటూరులో స్థానిక నాయకులు వేలూరు కేశవచౌదరి ఆధ్వర్యంలో జయంతిని  నిర్వహించారు. ఎన్టీఆర్‌ చిత్రపటానికి  మహిళలు పూలమాలలలు వేసి నివాళులర్పి ంచారు. అనంతరం భారీ కేకు కట్‌చేసి స్వీట్లు పంచిపెట్టారు. కార్యక్రమాల్లో యువత నాయకులు కృష్ణారెడ్డి, గోపి,  మహేష, ఉడతా పెంచలయ్య, హజరత్తయ్య, నాగులవెల్లటూరు సర్పంచ్‌ మస్తాన్‌ పాల్గొన్నారు.




Updated Date - 2022-05-29T04:29:02+05:30 IST