‘బయోడేటా’ ఇస్తున్నారేంది సారూ..!

ABN , First Publish Date - 2022-02-12T15:41:07+05:30 IST

ఓటర్లు తమను గుర్తుపెట్టుకొనేలా అభ్యర్థులు వినూత్న ప్రచారం చేపడుతున్నారు. ఈ నెల 19వ తేదీ జరుగనున్న పురపోరులో గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ (జీసీసీ) పరిధిలోని నుంగంబాక్కం 110వ వార్డులో అన్నాడీఎంకే

‘బయోడేటా’ ఇస్తున్నారేంది సారూ..!

పెరంబూర్‌(చెన్నై): ఓటర్లు తమను గుర్తుపెట్టుకొనేలా అభ్యర్థులు వినూత్న ప్రచారం చేపడుతున్నారు. ఈ నెల 19వ తేదీ జరుగనున్న పురపోరులో గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ (జీసీసీ) పరిధిలోని నుంగంబాక్కం 110వ వార్డులో అన్నాడీఎంకే తరఫున అభిషేక్‌ రంగస్వామి పోటీ చేస్తున్నారు. ఆయన ఓట్లు అభ్యర్థిస్తూ కరపత్రాలతోపాటు తన బయోడేటా అందజేస్తున్నారు. తన చదువు, చేస్తున్న ఉద్యోగం, పొందిన అవార్డులు, చీఫ్‌ గెస్ట్‌గా వెళ్లిన సభలు, పర్యటించిన దేశాల వివరాలతో పాటు రాజకీయ ప్రస్థానం తదితరాలతో కూడిన బయోడేటాను ఓటర్లకు అందిస్తున్నారు. 

Updated Date - 2022-02-12T15:41:07+05:30 IST