ఘనంగా అఖండ జ్యోతి

ABN , First Publish Date - 2022-08-13T05:39:52+05:30 IST

చౌడేశ్వరీదేవి అఖం డజ్యోతుల ఉత్సవాలు మద్దూర్‌లో శుక్రవారం ఘనంగా నిర్వ హించారు.

ఘనంగా అఖండ జ్యోతి
మద్దూర్‌లో అఖండ జ్యోతుల ఊరేగింపులో జాతీయ జెండాను చేతబట్టిన భక్తులు

- చౌడేశ్వరీ అమ్మవారికి ప్రత్యేక పూజలు 

- దేవీనామ స్మరణతో మారుమోగిన మద్దూర్‌ 


మద్దూర్‌/నారాయణపేట, ఆగస్టు 12: చౌడేశ్వరీదేవి అఖం డజ్యోతుల ఉత్సవాలు మద్దూర్‌లో శుక్రవారం ఘనంగా నిర్వ హించారు. మండల తొగుట వీరక్షత్రియ సంఘం ఆధ్వ ర్యంలో నిర్వహించిన ఉత్సవాల్లో భాగంగా అఖండ జ్యోతుల ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. అందంగా అలంక రించిన అఖండ జ్యోతులను పట్టణ శివారులో వెలసిన చౌడే శ్వరీ ఆలయం నుంచి ఉత్సవ ఊరేగింపు ప్రారంభించారు. ప్ర ధాన వీధుల గుండా సాగిన ఊరేగింపు పాత బస్టాండ్‌ బొ డ్రాయి వరకు కొనసాగింది. ఈ సందర్భంగా అఖండ జ్యోతు లను వెలిగించి, దేవీ నామస్మరణలో భక్తులు నృత్యాలు చేస్తు ముందుకు సాగారు. ఒళ్లు జలదరించే విధంగా ఇనుప చువ్వలను చెంపలకు గుచ్చుకొని దేవిపై తమకున్న అపార భక్తిని చాటుకున్నారు. అఖండ జ్యోతుల ఉత్సవం అనంతరం దేవికి మంగళహారతి ఇచ్చి అన్నదానం చేశారు. 

 దైవభక్తిలో సైతం దేశభక్తి..

అఖండ జ్యోతుల ఊరేగింపు సందర్భంగా తొగుట వీర క్షత్రియులు జాతీయ జెండాను చేతబూని దైవ భక్తితో పా టు, దేశభక్తిని చాటుకున్నారు. కార్యక్రమంలో తొగుట సంఘం సభ్యులు నర్సిములు, రథేశ్‌, మాజీ ఎంపీటీసీ సభ్యు డు ఆర్‌.మహదేవ్‌, విట్టల్‌, బాల్‌రాజు, శ్రీనివాస్‌, రామకృష్ణతో పాటు, ఉమ్మడి జిల్లాలోని మహబూబ్‌నగర్‌, నారాయణపేట, వనపర్తితో పాటు, వికారాబాద్‌ జిల్లాల తొగుట వీర క్షత్రి యులు పాల్గొన్నారు. అదేవిధంగా, నారా యణ పేట బ్రాహ్మణ వాడి తొగుట వీర క్షత్రి య సంఘం ఆధ్వ ర్యంలో చౌడేశ్వరీ మాత అఖండ జ్యో తుల ఊరేగింపు శుక్ర వారం మహిళల మం గళ హారతుల మధ్య ఖడ్గ విన్యాసాలు, ఆట పాటలతో ఘనంగా కొ నసాగింది. కార్యక్ర మంలో తొగుట వీర క్ష త్రియ సంఘం సభ్యు లు పాల్గొన్నారు.



Updated Date - 2022-08-13T05:39:52+05:30 IST