Green card: అమెరికాలోని భారతీయులకు గుడ్‌న్యూస్‌.. ఇక వేగంగా గ్రీన్‌కార్డులు జారీ

ABN , First Publish Date - 2022-09-25T13:06:18+05:30 IST

అమెరికాలో స్థిరపడాలనుకునే భారతీయులకు శుభవార్త. మరింత వేగంగా గ్రీన్‌కార్డులు జారీ చేయడంతోపాటు కార్డుల సంఖ్యను కూడా పెంచే దిశగా బైడెన్‌ సర్కారు చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు గ్రీన్‌కార్డుల జారీ ప్రక్రియ వ్యవధిని ఆరు నెలలకు తగ్గించాలంటూ ప్రెసిడెన్షియల్‌ కమిషన్‌ చేసిన సిఫారసులను వైట్‌హౌస్‌ పరిశీలిస్తోంది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే ప్రధానంగా భారత్‌..

Green card: అమెరికాలోని భారతీయులకు గుడ్‌న్యూస్‌.. ఇక వేగంగా గ్రీన్‌కార్డులు జారీ

గ్రీన్‌కార్డుల ప్రాసెసింగ్‌ వ్యవధి 6 నెలలకు తగ్గింపు

వాషింగ్టన్‌, సెప్టెంబరు 24: అమెరికాలో స్థిరపడాలనుకునే భారతీయులకు శుభవార్త. మరింత వేగంగా గ్రీన్‌కార్డులు జారీ చేయడంతోపాటు కార్డుల సంఖ్యను కూడా పెంచే దిశగా బైడెన్‌ సర్కారు చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు గ్రీన్‌కార్డుల జారీ ప్రక్రియ వ్యవధిని ఆరు నెలలకు తగ్గించాలంటూ ప్రెసిడెన్షియల్‌ కమిషన్‌ చేసిన సిఫారసులను వైట్‌హౌస్‌ పరిశీలిస్తోంది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే ప్రధానంగా భారత్‌, చైనాకు చెందిన కుటుంబాలకే ఎక్కువ ప్రయోజనం చేకూరనుంది. 


ఆసియన్‌ అమెరికన్లకు సంబంధించి ప్రెసిడెన్షియల్‌ అడ్వయిజరీ కమిషన్‌ ఈ ఏడాది మే నెలలోనే సిఫారసులను రూపొందించింది. వాటిని ఆగస్టు 24న ప్రభుత్వ ఆమోదం కోసం పంపించింది. వైట్‌హౌస్‌ డొమెస్టిక్‌ పాలసీ కౌన్సిల్‌ పరిశీలన అనంతరం వీటిని దేశాధ్యక్షుడు జో బైడెన్‌ వద్దకు పంపించనుంది. కొవిడ్‌-19 పరిస్థితులతో గ్రీన్‌కార్డుల జారీ భారీగా తగ్గిపోయింది. 2,26,000 గ్రీన్‌కార్డులు అం దుబాటులో ఉండగా, 2021లో కేవలం 65,452 కార్డులను మాత్రమే జారీ చేశారు. 

Updated Date - 2022-09-25T13:06:18+05:30 IST