30,453 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్‌సిగ్నల్‌

Published: Thu, 24 Mar 2022 13:57:54 ISTfb-iconwhatsapp-icontwitter-icon
30,453 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్‌సిగ్నల్‌

వేర్వేరుగా జీవోలు జారీ 

హోంశాఖలో 17,096, వైద్యారోగ్యంలో 12,735

గ్రూప్‌-1 కింద 503 ఖాళీల భర్తీ

రవాణా, పీఆర్‌, ఆర్థిక, మున్సిపల్‌లోనూ

అనంతరం టీఎస్‌పీఎస్సీ, బోర్డుల నుంచి నోటిఫికేషన్లు


హైదరాబాద్‌, మార్చి 23(ఆంధ్రజ్యోతి): నిరుద్యోగుల నిరీక్షణ ఫలించనుంది. ఎప్పటినుంచో ఊరిస్తున్న ఉద్యోగ నోటిఫికేషన్లు రాబోతున్నాయి. బుధవారం ఏకంగా 30,453 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులిచ్చింది. వీటికి సంబంధించి శాఖలవారీగా నియామక అనుమతుల జీవోలను జారీ చేసింది. ఏయే బోర్డులు ఏయే పోస్టుల ఎంపిక బాధ్యతలు చేపట్టాలో నిర్దేశించింది. ఆయా శాఖల నుంచి ఇండెంట్లు రాగానే టీఎ్‌సపీఎస్సీ సహా ఆయా బోర్డులు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయనున్నాయి. గ్రూప్‌-1 పోస్టులకు దశాబ్దం తర్వాత నోటిఫికేషన్‌ రాబోతోంది. గ్రూప్‌-1 కింద 503 పోస్టులను భర్తీ చేయనున్నారు. మిగతావాటిలో పోలీసు, జైళ్లు, వైద్యారోగ్యం, రవాణా శాఖల పోస్టులున్నాయి. హోంశాఖలో అత్యధికంగా 17,096, వైద్య శాఖలో 12,735 ఖాళీలు భర్తీ కానున్నాయి. రవాణాలో 216, ఆర్థిక శాఖలో 78, పంచాయతీరాజ్‌లో 126, రెవెన్యూ శాఖలో 121, సంక్షేమ శాఖలో 16, మున్సిపల్‌ శాఖలో 35, కార్మిక శాఖలో 10 ఉద్యోగ ఖాళీలను నింపనున్నారు. కాగా, ఆర్థిక శాఖ అనుమతిచ్చిన ఈ పోస్టులకు ఆయా శాఖల నుంచి ఇండెంట్లు పెట్టాల్సి ఉంటుంది. 


ఆయా పోస్టులకు అనుగుణంగా విద్యార్హతలు, రోస్టర్‌ పాయింట్లు, రిజర్వేషన్లు పూర్తి చేసి శాఖలు బోర్డులకు ఇండెంట్లు పంపాలి. గ్రూప్‌-1కు సంబంధించిన పోస్టులకు దాదాపు 20 శాఖల నుంచి టీఎ్‌సపీఎస్సీకి ఇండెంట్లు రావాలి. వేటికవే ఇండెంట్లు పంపాలంటే కనీసం నెల సమయం పడుతందని అధికార వర్గాలు వివరిస్తున్నాయి. ఈ ఇండెంట్లు వచ్చిన తర్వాత టీఎ్‌సపీఎస్సీ, పోలీసు, వైద్య ఆరోగ్య బోర్డులు న్యాయపరమైన చిక్కులపై ‘లీగల్‌ స్ర్కూటినీ’ చేస్తాయి. తమ బోర్డుల్లోని సీనియర్‌ న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతాయి. ఎలాంటి  చిక్కులు లేవని నిర్ధారించుకున్నాక.. ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేస్తాయి. 


శాఖల వారీగా పోస్టులు..

రెవెన్యూ శాఖ: డిప్యూటీ కలెక్టర్లు (42), కమర్షియల్‌ ట్యాక్స్‌ ఆఫీసర్లు(48), అసిస్టెంట్‌ ఎక్సయిజ్‌ సూపరింటెండెంట్లు (26), జిల్లా రిజిస్ట్రార్‌ (5). 

మొత్తం : 121. ఇవన్నీ గ్రూప్‌-1 పోస్టులే.


రవాణా శాఖ : ఆర్టీవో : 4, సహాయ మోటారు వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌లు 113, జూనియర్‌ అసిస్టెంట్లు 36, ట్రాన్స్‌పోర్టు కానిస్టేబుల్స్‌ 63. మొత్తం:216


ఆర్థిక శాఖ: అసిస్టెంట్‌ ఆడిట్‌ ఆఫీసర్‌-40, అసిస్టెంట్‌ ట్రెజరీ ఆఫీసర్‌-38.  మొత్తం: 78 పంచాయతీరాజ్‌: ఎంపీడీవో-121, జిల్లా పంచాయత్‌ ఆఫీసర్‌-5, మొత్తం :126.


సంక్షేమ శాఖ: జిల్లా బీసీ డెవల్‌పమెంట్‌ ఆఫీసర్‌-5, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి-6, జిల్లా ట్రైబల్‌ అధికారి-2, జిల్లా సాంఘిక సంక్షేమ అధికా- 3: మొత్తం: 16మున్సిపల్‌ శాఖ:  మున్సిపల్‌ కమిషనర్‌ (గ్రేడ్‌-2): 35, మొత్తం:35


కార్మిక శాఖ: అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ లేబర్‌-8, జిల్లా ఉపాధి అధికారి-2 మొత్తం :10


హోం శాంఖ మొత్తం: 17,096(పోలీస్‌ విభాగం): డీఎస్పీ 91, సివిల్‌ ఎస్సై 415, ఏఆర్‌ ఎస్సై 69, టీఎ్‌సఎస్పీ ఎస్సై 23, సివిల్‌ కానిస్టేబుల్‌-4965, ఏఆర్‌ కానిస్టేబుల్‌ 4423, టీఎ్‌సఎస్పీ కానిస్టేబుల్‌ 5,704, స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (ఎస్పీఎఫ్‌) కానిస్టేబుల్‌ 390, ఎస్సైలు 12.


జైళ్ల శాఖ: డిప్యూటీ సూపరింటెండెంట్‌ 2, డిప్యూటీ జైలర్‌ 8, వార్డర్‌ 136, మహిళా వార్డర్‌ 10. హోంశాఖలోని వివిధ విభాగాల్లో 261 జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులున్నాయి.


వైద్య శాఖ: ఎంపీహెచ్‌ఏ (ఫిమేల్‌) 1,785, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ 1,228, స్టాఫ్‌ నర్సు 4,661, ట్యూటర్‌ 357, సివిల్‌ అసిస్టెంట్‌  సర్జన్‌ 1,852,. వైద్యవిధాన పరిషత్‌లో 301. ఇవికాకుండా ఆయుష్‌, డీఎంఈ, డీహెచ్‌, ఐపీఎంలో వివిధ పోస్టులను భర్తీ చేయనున్నారు.


సీఎం కేసీఆర్‌ లక్కీ నంబరు 6 కలిసివచ్చేలా..

ముఖ్యమంత్రి కేసీఆర్‌ లక్కీ నంబర్‌ ‘6’ కలిసివచ్చేలా బుధవారం పోస్టుల సంఖ్య ప్రకటించడం గమనార్హం. ఉద్యోగాల మొత్తం సంఖ్యలోని అంకెలను (30,453) కూడితే... 6 వస్తుండడం విశేషం. రాష్ట్రంలో మొత్తం 91,142 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో 11,103 కాంట్రాక్టు పోస్టులు పోగా 80,039 పోస్టులకు తక్షణమే నోటిఫికేషన్లు జారీ చేస్తామని ప్రకటించారు. 30,453 పోస్టులకు తాజాగా ఆర్థిక శాఖ అనుమతిచ్చింది. 49,586 పోస్టులకు అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. అధికారులతో చర్చించి వీటికి అనుమతి ఇవ్వనున్నారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

జాతీయం Latest News in Teluguమరిన్ని...

క్రీడాజ్యోతిLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.