సీట్ల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌

ABN , First Publish Date - 2022-08-12T05:59:26+05:30 IST

వనపర్తి మెడికల్‌ కాలేజీలో ఈ ఏడాది నుంచే ఎంబీబీ ఎస్‌ తరగతులు ప్రారంభం కానున్నా యి.

సీట్ల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌

- మెడికల్‌ కాలేజీలో  150 సీట్లను భర్తీ చేసేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు

- ఇప్పటికే తరగతులకు సిద్ధంగా  కాలేజీ కాలేజీ భవనం 

 - మార్చిలో కళాశాల నిర్మాణానికి సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన

- జిల్లాలో ఇప్పటికే ప్రారంభమైన జిల్లా జనరల్‌ ఆస్పత్రి సేవలు

వనపర్తి, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): వనపర్తి మెడికల్‌ కాలేజీలో ఈ ఏడాది నుంచే ఎంబీబీ ఎస్‌ తరగతులు ప్రారంభం కానున్నా యి. ఈ మేరకు నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ 2022-23 సంవత్సరానికి గాను 150 సీట్లను భర్తీ చేసుకో వడానికి అనుమతులు జారీ చేసింది. త్వరలో రాష్ట్రంలోని అన్ని మెడికల్‌ కాలేజీలతో పాటు వనపర్తిలో కూడా వైద్యవిద్యార్థులకు ప్రవేశాలు పొందనున్నారు. వనపర్తి మెడికల్‌ కాలేజీకి 2021 మే నెలలో రాష్ట్ర కేబినేట్‌ ఆమోదం తెలిిపింది. ఇందులో భాగంగా జిల్లా ఆస్పత్రిని జనరల్‌ ఆస్పత్రిగా అప్‌గ్రేడ్‌ చేయడంతో పాటు మెడికల్‌ కళాశాలకు అనుబంధంగా ఉండాల్సిన ప్రొఫెసర్లు, వైద్యులు, సిబ్బందిని కూడా కేటా యించింది. జిల్లా ఆస్పత్రి, ఎంసీహెచ్‌ ఆస్పత్రు లను తాత్కాలికంగా మెడికల్‌ కాలేజీకి అను బంధంగా వాడుకోనుండగా.. నర్సింగ్‌ కళాశాల కోసం నిర్మించిన భవనంలో తాత్కాలికంగా ఎంబీబీఎస్‌ తరగతులను ప్రారంభించనున్నారు. ఈ ఏడాది మార్చి 8న సీఎం కేసీఆర్‌ వనపర్తి కలెక్టరేట్‌ సమీపంలో మెడికల్‌ కాలేజీ, ఆస్పత్రి, హాస్టళ్లు, ప్రొఫెసర్ల నివాసగృహాలకు సంబంధిం చిన నిర్మాణాల కోసం శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం ఆ పనులు సాగుతుండగా.. తాజాగా వచ్చిన అనుమతులతో ఈ ఏడాది నుంచే తరగతులు  ప్రారంభం కానున్నాయి. మొత్తం రూ. 510 కోట్లతో 51 ఎకరాల స్థలంలో మెడిక ల్‌ కాలేజీ ప్రాంగణం రూపుదిద్దుకోనుంది. ఇటీవల వనపర్తి మెడికల్‌ కాలేజీతో పాటే మంజూరైన నాగర్‌కర్నూలు మెడికల్‌ కాలేజీకి ఎన్‌ఎంసీ అనుమతులు ఇవ్వగా.. తాజాగా వనపర్తి మెడికల్‌ కాలేజీకి కూడా అనుమతులు లభించాయి. 

అందుబాటులో వైద్యసేవలు 

రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ జిల్లాకో మెడికల్‌ కాలేజీని ఏర్పాటు చేయాలనే లక్ష్యంలో భాగంగా వనపర్తి జిల్లాకు మెడికల్‌ కాలేజీని మొదటి విడతలో మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది నుంచి మొదటి సంవత్సరం తరగతులు కూడా ప్రారంభమవు తుండటంతో ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందుబాటులోకి రానుంది.  

మారనున్న వనపర్తి స్వరూపం... 

వనపర్తి నూతన జిల్లాగా ఏర్పడిన తర్వాత ప్రజలకు ప్రభుత్వ సేవలు అందుబాటులోకి వచ్చినప్పటికీ.. జిల్లా కేంద్రానికి తగ్గట్లుగా వసతులు సరిగా లేవనే అభిప్రాయం ఉండేది. అయితే మెడికల్‌ కాలేజీకి తాజాగా అనుమ తులు రావడం.. ఈ ఏడాది నుంచే తరగతులు ప్రారంభవుతుండటం.. వీటితోపాటు ప్రభుత్వ ఇంజనీరింగ్‌ కళాశాల, వనపర్తి పాలిటెక్నిక్‌ కళాశాల ప్రాంగణంలోనే తాత్కాలికంగా ప్రారం భం కాబోతుండటంతో వనపర్తి ముఖచిత్రం మారిపోయే అవకాశం ఉంది. విద్యార్థులు, అందులో పనిచేసే సిబ్బందికి తగ్గట్లుగా వనప ర్తిలో సౌకర్యాల కల్పన జరగనుంది. ప్రస్తుతం రోడ్ల విస్తరణ కొనసాగుతుండగా.. త్వరితగతిన పూర్తయితే.. పట్టణ స్వరూపం మారిపోతుం దని పలువురు అభిప్రాయపడుతున్నారు.



Updated Date - 2022-08-12T05:59:26+05:30 IST