Advertisement

మాన్సాస్‌ ట్రస్టు భూముల్లో.. ఇసుక తవ్వకాలకు మళ్లీ గ్రీన్‌సిగ్నల్‌?

Sep 16 2020 @ 11:26AM

ఇద్దరు సభ్యుల బృందంతో ఏపీఎండీసీ అధికారుల ఒప్పందం

50 వేల క్యూబిక్‌ మీటర్ల ఇసుక తవ్వకాలకు రంగం సిద్ధం

మాన్సాస్‌ భూముల్లో ఇసుక నిల్వలపై కన్నేసిన నేతలు

ట్రస్టు నిబంధనలకు విరుద్ధంగా ఒప్పందాలు


అమలాపురం (ఆంధ్రజ్యోతి): గౌతమి గోదావరి పరీవాహక ప్రాంతంలోని మాన్సాస్‌ ట్రస్టుకు చెందిన లంక భూముల్లో నిబంధన లకు విరుద్ధంగా మరోసారి ఇసుక తవ్వకాలు చేపట్టేందుకు జిల్లా యంత్రాంగం రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ఏపీఎండీసీ అధికారు లతో మాన్సాస్‌ ట్రస్టుకు చెందిన ఇద్దరు ప్రతినిధుల బృందం ఇటీవల ఒప్పందం చేసుకుంది. విజయనగరంలోని మాన్సాస్‌ ట్రస్టుకు చెందిన ఈ భూముల్లో ఇసుక తవ్వకాలు చేపట్టేందుకు అనుమతి సాధించ డం వెనుక కీలకమైన వైసీపీ నేతల సిండికేట్‌తోపాటు ప్రభుత్వ పెద్దల హస్తం ఉన్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జాతీయ రహదారి నిర్మాణం పేరిట, ఈ ఏడాది మార్చిలో కాకినాడలో వైసీపీ కీలక ప్రజాప్రతినిధులు కనుసన్నల్లో డంపింగ్‌ యార్డు పేరిట ఇసుక దోపిడీ భారీగా జరిగింది.


ఇక విజ యనగరంలోని మాన్సాస్‌ ట్రస్టుకు సంబంధించిన వందల ఎకరాల భూములు కె.గంగవరం మండలం పరిధిలోని కోటిపల్లి గ్రామ ప్రాంతంలో ఉన్నాయి. మాన్సాస్‌ ట్రస్టుబోర్డు చైర్మన్‌గా సంచయిత బాధ్యతలు స్వీకరించిన కొద్దిరోజుల్లోనే ఆ భూములపై అధికార వైసీపీకి చెందిన కొందరు పెద్దలు కన్నేసి ఏపీఎండీసీ ముసుగులో ఇసుక తవ్వేందుకు అధికారుల నుంచి అనుమతులు పొందారు. కోటిపల్లి గ్రామపరిధిలోకి వచ్చే వివిధ సర్వే నెంబర్లలో 93 ఎకరాల భూమిలో 42.11 ఎకరాల్లో ఇసుక తవ్వకాలు జరుపుకునేందుకు అను మతినిస్తూ కలెక్టర్‌ మార్చి 13న ఉత్తర్వులు జారీచేశారు. అప్పట్లో క్యూబిక్‌ మీటర్‌కు రూ.60గా ధరను నిర్ణయించి 6 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఇసుక తరలింపునకు అనుమతి ఇచ్చినప్పటికీ రెండు, మూడు రెట్లు ఇసుకను దోచేశారు.


అయితే తాజాగా మరోసారి ఇసుక దోపిడీ చేసేందుకు మాన్సాస్‌ ట్రస్టు చైర్మన్‌ సంచయిత నియమించిన ఇద్దరు ప్రతినిధుల బృందం ఎంపీఎండీసీ అధికారులతో ఒప్పందం కుదుర్చు కున్నారు. కానీ ట్రస్టు ఈవో సిఫారసులతో ఈ ఒప్పందాలు జరగాలనే నిబంధనను ట్రస్టు ఉల్లంఘించింది. తాజాగా మాన్సాస్‌ భూముల్లో 50 వేల క్యూబిక్‌ మీటర్లు మేర ఇసుక తవ్వేందుకు క్యూబిక్‌ మీటరుకు రూ.100 ధరగా నిర్ణయించి ఏపీఎండీసీ తవ్వకాలు చేపట్టిన తర్వాత రూ.49.80 లక్షలను ట్రస్టుకు జమ చేయాల్సి ఉంది. త్వరలోనే అనుమతులను కలెక్టర్‌ ఏపీఎండీసీకి ఇవ్వనున్నట్టు సమాచారం. 

Follow Us on:
Advertisement
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.