పల్లెలను పరిశుభ్రంగా ఉంచాలి: జడ్పీ సీఈవో ప్రియాంక

ABN , First Publish Date - 2021-02-28T04:39:20+05:30 IST

పల్లెలన్ని పరిశుభ్రంగా ఉంచాలని జిల్లాపరిషత్‌ సీఈవో ప్రియాంక అన్నారు.

పల్లెలను పరిశుభ్రంగా ఉంచాలి: జడ్పీ సీఈవో ప్రియాంక
బురదరాఘవాపురంలో నర్సరీ పరిశీలిస్త్ను సీఈవో

 పల్లెప్రగతి పనులు పరిశీలన

ఏన్కూరు, ఫిబ్రవరి27: పల్లెలన్ని పరిశుభ్రంగా ఉంచాలని జిల్లాపరిషత్‌ సీఈవో ప్రియాంక అన్నారు. శనివారం మండలంలోని బురదరాఘవాపురం గ్రామంలో ఆమె పర్యటించారు. వైకుంఠధామం, ప్రకృతివనం, నర్సరీ, కంపోస్టుషెడ్‌, ఉన్నత,, ప్రాఽథమిక పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రం వాటర్‌ట్యాంక్‌, డ్రెయినేజీలు పరిశీలించారు. పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాలను పరిశుభ్రంగా ఉంచాలని డ్రెయినేజీల్లో చెత్తా తొలగించాల ని అన్నారు. బురదరాఘవాపురం గ్రామ పంచాయతీ కార్యాలయంలో రికార్డులు పరిశీలించారు.అనంతరం స్థా నిక మండలపరిషత్‌ను సందర్శించి రికార్డులు పరిశీలించారు. పల్లెలన్నీ పరిశుభ్రంగాఉండేలా అధికారులు,సర్పంచ్‌లు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ వరలక్ష్మి, జడ్పీటీసీ బాదావత్‌ బుజ్జి, ఎంపీడీవో అశోక్‌, సర్పంచ్‌ కృష్ణప్రియ, ఏపీవో సూరయ్య, ఉపసర్పంచ్‌ రమేష్‌, పంచాయతీ కార్యదర్శి శివ, పాల్గొన్నారు.


Updated Date - 2021-02-28T04:39:20+05:30 IST