హరితహారం దేశానికే తలమానికం : ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2021-07-24T04:59:52+05:30 IST

హరితహారం దేశానికే తలమానికం : ఎమ్మెల్యే

హరితహారం దేశానికే తలమానికం : ఎమ్మెల్యే
ముక్కోటి వృక్షార్చన పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే

కడ్తాల్‌ : హరితహారం కార్యక్రమం దేశానికే తలమానికంగా నిలుస్తోందని కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్కా జైపాల్‌యాదవ్‌ అన్నారు. హరిత సంకల్పంలో ప్రజలంతా భాగస్వాములై ఉద్యమ స్ఫూర్తితో మొక్కలు నాటి సంరక్షించాలని ఆయన కోరారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ జన్మదినాన్ని పురస్కరించుకొని గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో భాగంగా రాజ్యసభ సభ్యుడు సంతో్‌షకుమార్‌ ఆధ్వర్యంలో శనివారం చేపట్టే ముక్కోటి వృక్షార్చన కార్యక్రమ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వృక్షార్చన కరపత్రాలు, పోస్టర్లను జడ్పీటీసీ దశరథ్‌నాయక్‌, డీసీసీబీ డైరెక్టర్‌ గంప వెంకటేశ్‌, సర్పంచ్‌ గూడూరు లక్ష్మీనర్సింహారెడ్డితో కలిసి ఎమ్మెల్యే ఆవిష్కరించారు. కార్యక్రమంలో నాయకులు పరమేశ్‌, వీరయ్య, లచ్చీరామ్‌ నాయక్‌, తదితరులు పాల్గొన్నారు. 

కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కుల పంపిణీ

తలకొండపల్లి/శంషాబాద్‌ : మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో శుక్రవారం సాయంత్రం 61 మంది కల్యాణక్ష్మి లబ్ధిదారులకు ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో లలితజ్యోతయ్య, కుమార్‌, సుధాకర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. శంషాబాద్‌ మున్సిపల్‌ కేంద్రంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో 114 మంది కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ లబ్ధిదారులకు శుక్రవారం ఎమ్మెల్యే ప్రకా్‌షగౌడ్‌ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ జయమ్మ, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సుష్మ, వైస్‌ చైర్మన్‌ గోపాల్‌యాదవ్‌ కౌన్సిలర్‌ భాగ్యలక్ష్మి, వెంకటేశ్‌గౌడ్‌తో పాల్గొన్నారు. 

లక్ష మొక్కలు నాటే కార్యక్రమం

ఇబ్రహీంపట్నం: మంత్రి కేటీఆర్‌ జన్మదినం సందర్బంగా నేడు ఆగాపల్లి-గున్‌గల్‌ అటవీ ప్రాంతంలో లక్ష మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ సత్తు వెంకటరమణారెడ్డి తెలిపారు. ఉదయం 10.30 గంటలకు జరిగే కార్యక్రమంలో మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి పాల్గొంటారని తెలిపారు. 

Updated Date - 2021-07-24T04:59:52+05:30 IST