హరితహారాన్ని విజయవంతం చేయాలి

ABN , First Publish Date - 2021-06-20T05:33:12+05:30 IST

హరితహారాన్ని విజయవంతం చేయాలి

హరితహారాన్ని విజయవంతం చేయాలి
మాట్లాడుతున్న మంత్రి సబితాఇంద్రారెడ్డి

  • ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలి
  • వీడియో కాన్ఫరెన్స్‌లో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి 

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌): ఏడో విడత హరితహారంలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని రాష్ట్ర విద్యాశాఖమంత్రి  సబితాఇంద్రారెడ్డి అన్నారు. హరితహారంపై శనివారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ నుంచి ఆమె వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్లతో మాట్లాడారు. ఏడో విడత హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసి హరితతెలంగాణ కోసం అడుగులు వేయాలన్నారు. జిల్లాలో 70 లక్షల మొక్కలు నాటేందుకు లక్ష్యం కాగా అందుకు మండలాలు, మున్సిపాలిటీలకు నిర్ధేశించిన లక్ష్యంమేరకు మొక్కలు నాటేందుకు ప్రణాళిక సిద్ధ్దం చేసుకోవాలని సూచించారు. ప్రతి మండలంలో 10ఎకరాల స్థలంలో మొక్కలు నాటేందుకు స్థలాలు గుర్తించాలన్నారు ఇంటింటికీ అందించే 6 మొక్కలలో తులసి, జామ, కరివేపాకు, పూలమొక్కలు ఉండేలా చూడాలన్నారు. పాఠశాలలు, కళాశాల, ఆసుపత్రులు, డంపింగ్‌ యార్డులు, చెరువులు, రైతుల పొలాల్లో, రైతు వేదికల వద్ద మియావాకి, వేపమొక్కలు నాటాలని సూచించారు. ఖాళీస్థలాలు, రోడ్లకు ఇరువైపులా, అనువైన ప్రదేశాలను గుర్తించి మొక్కలు నాటాలని తెలిపారు. రోడ్ల వెడల్పు పనులు దృష్టిలో ఉంచుకుని మొక్కలు నాటాలని, పట్టణాల్లో ప్రకృతి వనాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. నర్సరీలపై ప్రత్యేక దృష్టి సారించాలని, గ్రామస్థాయిలో వార్డు సభ్యుల నుంచి సర్పంచ్‌ల వరకు, కౌన్సిలర్ల నుంచి చైర్మన్ల వరకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లోశేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, జడ్పీ చైర్‌పర్సన్‌ అనితారెడ్డి, కలెక్టర్‌ అమయ్‌కుమార్‌, అదనపు కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌,  ఎమ్మెల్యేలు కాలె యాదయ్య,  మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్‌, అంజయ్యయాదవ్‌, అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-20T05:33:12+05:30 IST