Advertisement

హరితహారం మొక్కలు.. అగ్నికి ఆహుతి!

Feb 28 2021 @ 00:04AM
ఇచ్చోడ-గుబ్బ గ్రామల మార్గంలో కాలిపోత్నున్న హరితహారం మొక్కలు

ఇచ్చోడ, ఫిబ్రవరి 27: హరితహారంలో భాగంగా రోడ్లకు ఇరువైపులా నాటిన మొక్కలు అగ్నికి ఆహుతి అవుతున్నాయి. మండల కేంద్రానికి కూత వేటు దూరంలో ఉన్న ఆడేగామా(కే) గ్రామ పంచాయతీ ఫరిధిలో రోడ్డుకు ఇరు వైపులా నాటిన మొక్కలు శనివారం అగ్నికి ఆహుతి అయ్యాయి. ఎవరో నిప్పు పెట్టడంతోనే మంటలు వ్యాపించాయి. నిత్యం జన సందడి ఉండే ప్రాంతం అయినప్పటికీ.. క్షేత్రస్థాయిలో అధికారుల పర్యవేక్షణ కరువైందని, మొక్కలను కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని  స్థానికులు అంటున్నారు. 

Follow Us on:
Advertisement