Advertisement

హరితహారాన్ని విజయవంతం చేయాలి

Jun 30 2020 @ 05:31AM

నార్నూర్‌ : హరితహార కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఇన్‌చా ర్జి ఎంపీడీవో గంగాసింగ్‌ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ఎం పీడీవో కార్యాలయంలో పంచాయతీ సర్పంచ్‌లు, కార్యదర్శులు, ఈజీఎస్‌ సి బ్బందితో  సమావేశం నిర్వహించారు. జూలై 1 నుంచి  మొక్కలు నాటడం ప్రారంభించాలన్నారు. ఆయా పంచాయతీలలోని నర్సరీల్లో మొక్కలు అందు బాటులో ఉన్నాయన్నారు. పెద్దఎత్తున మొక్కలు నాటి విజయవంతం చే యాలన్నారు. పెండింగ్‌లో ఉన్న మరుగుదొడ్లు, ఇంకుడుగుంతల నిర్మాణాలను పూర్తి చేయాలన్నారు. సమావేశంలో ఈజీఎస్‌ ఏపీవో శేషారావు జాద వ్‌, ఆయా పంచాయతీ సర్పంచ్‌లు, కార్యదర్శులు పాల్గొన్నారు. 

Follow Us on:
Advertisement
Advertisement